Salmaan Khan: ఈవెంట్ లో సల్మాన్ ఖాన్.. అందుకోసమే రావాల్సిందే?

Salmaan Khan: టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమా విడుదల అయి ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ చిత్ర యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమా విడుదల కావడానికి ఇంకా నెల రోజులు ముందు నుంచే ఈ సినిమాను ప్రమోట్ చేసే పనిలో బిజీ అయ్యారు. రాజమౌళి ప్లాన్ గురించి అందరికీ తెలిసిన విషయమే.

ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కనున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎలా నిర్వహిస్తారు అనేది కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర ఇండస్ట్రీ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఇందుకోసం కార్తికేయ, డివివి దానయ్య ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు

అయితే ఆ ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రత్యేక అతిథిగా రాబోతున్నట్లు సమాచారం..సల్మాన్ ఖాన్ రామ్ చరణ్ కు మంచి స్నేహితులు ఉన్న విషయం తెలిసిందే. ఇక మెగాఫ్యామిలీతో సల్మాన్ ఖాన్ చాలా సన్నిహితంగా ఉంటున్నాడు. ఉపాసన కొణిదెల కుటుంబంతో కూడా ఆయనకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అందుకోసం అయినా కూడా సల్మాన్ ఖాన్ ఈవెంట్ కోసం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.