Tiger 3: టైగర్ 3 సినిమా విడుదల తేదీ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?

Tiger 3: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం టైగర్ 3. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఆఫ్ స్క్రీన్ జోడిగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. వీరిద్దరి కలయికలో టైగర్ 3 సినిమా ఫిక్స్ అయినప్పటి నుంచి ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారు.

 

ఇదిలా ఉంటే ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ్వడంతో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మూవీ మేకర్స్. ఇందుకు సంబంధించిన వీడియోని సల్మాన్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం అనగా 2023 ఈద్ పండుగ సందర్భంగా ఏప్రిల్ 21న హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. సల్మాన్ ఖాన్ షేర్ చేసిన వీడియో ఈ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.