Salman Khan: సొంత ఇంటిని అద్దెకి ఇచ్చిన సల్లూ భాయ్.. అద్దె ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Salman Khan: బాలీవుడ్ బాయ్ జాన్ సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముంబైలో ఉన్నటువంటి తన సొంత ఇంటిని అద్దెకి ఇస్తున్నట్లు తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ కి ముంబైలో పలు ప్రాంతాలలో ఎన్నో భవనాలు ఉన్నప్పటికీ ఈయన మాత్రం బాంద్రా వెస్ట్‌లోని శివ్‌ అస్థాన్‌ హైట్స్‌లో నెలకు రూ. 95,000 చొప్పున సల‍్మాన్‌ బాంద్రా బ్యాండ్‌ స్టాండ్‌కు సమీంపలో ఉన్న గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని 14 వ అంతస్తును అద్దెకు ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ అపార్ట్ మెంట్ ను సల్మాన్ ఖాన్ ఏకంగా 33 నెలలపాటు అద్దెకు ఇవ్వబోతున్నట్లు అగ్రిమెంట్లు కుదుర్చుకున్నారు. అగ్రిమెంట్ డిసెంబర్ ఆరో తేదీ పూర్తయిందని సమాచారం. దీనికి సంబంధించిన పత్రాలు Zapkey.com వెబ్‌సైట్‌ లో పొందుపరచారని తెలుస్తోంది. ఇక ముంబైలో పలు ప్రాంతాలలో ఈయనకు ఎంతో విలాసవంతమైన ఖరీదైన భవనాలు ఉండగా సల్మాన్ ఖాన్ మాత్రం తన అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లోని ఒక వన్‌ బీహెచ్‌కే ఇంట్లో నివసిస్తున్న తెలుస్తుంది.

ఎంతో ఖరీదైన భవనాలు బంగ్లాలు ఉన్నప్పటికీ సల్మాన్ ఖాన్ ఇలా వన్‌ బీహెచ్‌కే ఇంట్లో నివసించడం చూస్తుంటే ఆయన పబ్లిసిటీకి ప్రతి ఒక్కరు ఫిదా కావాల్సిందే. ఇక సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఒకవైపు బుల్లితెరపై ప్రసారమౌతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడమే కాకుండా పలు చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అలాగే మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమాలో కూడా సల్మాన్ ఖాన్ సందడి చేయనున్నారు.