విరాటపర్వం సినిమా రిజల్ట్స్ పై సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్…?

పేరుకి మలయాళీ అమ్మాయి అయినప్పటికీ అచ్చం తెలుగింటి ఆడపిల్లలా తెలంగాణ యాస మాట్లాడుతు ప్రేక్షకులకి దగ్గరైన హీరోయిన్ సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన సాయి పల్లవి ఈ సినిమాతో ప్రేక్షకులందరినీ ఫిదా చేసింది. ఆ సినిమా హిట్ అవటంతో వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ…అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సాయి పల్లవి ఒక వైవిధ్యమైన హీరోయిన్. హీరోయిన్ గా ఇండస్ట్రీకి అడుగుపెట్టినప్పటి నుండి సాయి పల్లవి గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటినకు ప్రాధాన్యత ఉన్న పాత్రలలో నటిస్తోంది.

ఇలా ఆమె నటించిన అన్ని సినిమాలు మంచి హిట్ అవుతున్నాయి. ఇలా ఈ అమ్మడు లేడి సూపర్ స్టార్ గా గుర్తింపు పొందింది. ఇటీవల సాయి పల్లవి నటించిన విరాటపర్వం సినిమా విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వేణు ఉడుగుల దర్శకత్వంలో దగ్గుబాటి రానా, సాయి పల్లవి హీరో, హీరోయిన్లుగా నటించిన విరాటపర్వం సినిమా ఒక నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దాని ఎఫెక్ట్ సినిమా మీద పడింది .

ఇదిలా ఉండగా విరాటపర్వం సినిమా తర్వాత సాయి పల్లవి గార్గి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తొందర్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి ఇచ్చిన స్టేట్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా సాయి పల్లవి విరాటపర్వం రిజెల్ట్ పై మాట్లాడుతు.. .బాక్సాపీస్ ఫలితంతో సబంధం లేకుంగా నటిగా విరాటపర్వం తనకు సంతృప్తి నిచ్చిందని తెలియచేసింది. ప్రేమ, కోపం, దుఖం లాంటి అన్ని రకాల ఎమోషన్లు ఓకే సినిమాలో పండించే అవకాశం చాలా అరుదుగా దొరుకుతాయని, ఆ అవకాశం విరాటపర్వం సినిమాతో తనకు దక్కిదని అన్నారు . అందుకే సినిమాను అంగీకరించే ముందు తాను ఎలాంటి ఆశలు పెట్టుకోనని స్టేట్మెంట్ ఇచ్చారు. విరాటపర్వం సినిమా రిసల్ట్ పై సాయి పల్లవి ఇలా ఓపెన్ అవ్వటంతో అలా ఓప్పుకోవడం.. మాట్లాడడం చాలా గ్రేట్ కదాఅనే.. కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.