మెగా హీరో సాయి తేజ్ చేస్తున్న కొత్త చిత్రం ‘రిపబ్లిక్’. దేవ కట్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పూర్తిగా రాజకీయ నేపథ్యంలో రూపొందుతున్న సినిమా ఇది. ఇందులో తేజ్ సివి సర్వీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. మొదటి నుండి ప్రజాస్వామ్యం, రాజకీయాలు, వ్యవస్థలు, ప్రజలు అంటూనే ఈ సినిమాను పరిచయం చేశారు. ఈరోజు రిలీజ్ చేసిన టీజర్లో అయితే సినిమా పూర్తి స్వరూపం బయటపడిపోయింది. మన జీవితాల నుండి రాజకీయాలను వేరు చేయలేము అనే జార్జ్ ఆర్వెల్ కొటేషన్ మీద మొదలైన టీజర్ ‘ప్రజాస్వామ్యం అంటే ఓటు హక్కో లేకుంటే అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం.
కానీ కట్టకుండానే కొలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలీక ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే బ్రతుకుతున్నాం. ప్రజలే కాదు సివిల్ సర్వెంట్స్, కోర్టులు కూడ ఆ రూలర్స్ కింద బానిసల్లానే బ్రతుకుతున్నారు. వ్యవస్థ పునాదులే కరెప్ట్ అయినప్పుడు మనమూ కరెప్ట్ అయినట్టే’ అంటూ బలమైన డైలాగ్స్ మీదే నడిచింది. టీజర్ ను బట్టి పాలకుల చేతుల్లో ప్రజలు, వ్యవస్థలు బానిసల్లా మారాయని, ప్రజాస్వామ్యానికి అర్థం తెలియకుండా పోయిందనే నిజాన్ని సినిమాలో గట్టిగా చెప్పాలని దేవ కట్ట అనుకుంటున్నట్టు అర్థమవుతోంది. కాన్సెప్ట్ అయిదే బాగానే ఉంది. అందులో డెప్త్ కూడ చాలా ఉంటుంది. దాన్ని సామాన్య ప్రేక్షకులకు సులభంగా అర్థమయ్యేలా కమర్షియల్ అంశాలను జోడించి గనుక చెప్పగలిగితే సినిమా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ.