మెగా హీరో జనాల మీద ఎంత పెద్ద సెటైర్ వేశాడు !

sai-dhram-teja

sai-dhram-teja

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ చేస్తున్న కొత్త చిత్రం ‘రిపబ్లిక్’. దేవ కట్ట దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పూర్తిస్థాయి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా ఇది. ప్రభుత్వం, ప్రజలు, పాలన అనేవే ఇందులో ప్రధాన అంశాలు. ఇదివరకే విడుదలైన సినిమా ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. లుక్ పరంగా ఇందులో కొత్తదనమేమీ లేదు. తేజ్ మునుపటి సినిమాల్లో ఎలా ఉన్నారో ఇందులో కూడ అలానే ఉన్నారు. ఏ మార్పూ లేదు. కానీ పోస్టర్ మీద వేసిన స్టేట్మెంట్ మాత్రం పూర్తిగా కొత్తగా ఉంది.

’74 ఏళ్లుగా ప్రభుత్వం ఉందన్న భ్రమలో బ్రతుకుతున్నాం. కానీ మనకు ఇంకా ఆ ప్రభుత్వం ఎలా ఉంటుందో కూడ తెలీదు’ అనేది స్టేట్మెంట్. దీన్నిబట్టి సినిమా ఎంత హార్డ్ హిట్టింగ్ పొలిటికల్ డ్రామానో అర్థం చేసుకోవచ్చు. చాలా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమాల్లో పార్టీలను, రాజకీయ నాయకులనే తప్పుబడుతుంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం ప్రజల్లో ఉన్న తప్పును కూడ వేలెత్తి చూపుతున్నారు. అసలు ప్రజలు ప్రభుత్వం పనితీరు గురించి తెలుకోవాలని అప్పుడే పాలకులు సక్రమంగా పనిచేస్తారని, అందరికీ అన్నీ తెలిస్తే ఎక్కడా మభ్యపెట్టడాలు, ప్రలోభాలు ఉండవనేది సినిమాలో కథానాయకుడి ఉద్దేశ్యం కావొచ్చు. మొత్తానికి తేజ్ జనాల మీద పెద్ద వ్యంగ్యాస్త్రమే వదిలాడు.