Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వల్లే సాయిధరమ్ తేజ్ కు నష్టం..తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. !

Pawan Kalyan

Pawan Kalyan: ఏపీలో టికెట్ల రచ్చ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం టికెట్ రేట్లను తగ్గించడంతో టాలీవుడ్ , ఏపీ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఇటీవల నాని, సిద్ధార్థ్ వంటి వారు ప్రభుత్వంపై నేరుగానే విమర్శలు చేశారు. అయితే టికేట్ ధరలపై ముందుగా మాట్లాడింది మాత్రం జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సాయిధరమ్ తేజ్ ‘ రిపబ్లిక్’ మూవీ సందర్భంగా పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ సందర్భంలో టికెట్ రేట్లపై ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పలు విమర్శలు చేశారు. అప్పడు ఈ అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది. జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్దానికి దారి తీసింది.  ఇదిలా ఉంటే తాజా ఈ వివాదంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు.

ఇలాంటి సినిమా వేదికలపై నుంచి ఇలా ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. జనసేన ఆఫీసు నుంచి ఏం విమర్శించినా పర్వాలేదు కానీ.. ఇలా ఓ సినిమా కార్యక్రమంలో విమర్శించడంతో సినిమాపై ప్రభావం చూపించిందని అన్నారు. పవన్ కళ్యాణ్, నాని, సిద్దార్ధ్ వీళ్లంతా మాట్లాడింది చూస్తే చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా ఉంది. పవన్ కళ్యాణ్ టికెట్ ఇష్యూపై సాయి ధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ సినిమా ఈవెంట్‌లో మాట్లాడటం ఏంటి? ఆయన అక్కడ మాట్లాడటం వల్ల ఇండస్ట్రీకి లాభం లేదు.. నాలెక్క ప్రకారం రిపబ్లిక్ సినిమాకే నష్టం వచ్చిందన్నారు.

రిపబ్లిక్ సినిమా అందరూ చూడాల్సిన మంచి సినిమా. సాధారణంగా సాయిధరమ్ తేజ్ సినిమా అంటే ఓపెనింగ్స్ బాగా వస్తాయి. అయితే ఈ సినిమాకు మాత్రం అలా జరగలేదని అన్నారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. 53 శాతం మంది ఆ పార్టీకీ ఓటేశారు. ఇందులో ఓ 10 శాతం మంది సినిమాను చూడకపోయినా.. సినిమాకు కలెక్షన్లు పడిపోతాయి. పవన్ మాట్లాడటం వల్లే రిపబ్లిక్ సినిమా పోయిందని తమ్మారెడ్డి అన్నారు. సినిమా ఫంక్షన్‌కి వచ్చి వైసీపీని తిడితే ఆ కుర్రాడి భవిష్యత్ దెబ్బతిన్నది. పవన్ కళ్యాణ్ అలా చేయాల్సింది కాదు. ఆయన ఉద్దేశ్యం మంచిదే కావచ్చు.. ఆ మాటలు తప్పా కరెక్టా అని కూడా నేను ప్రస్తావించను.. కానీ మాట్లాడాల్సిన సందర్భం కాదని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.