సమంత బర్త్ డే కు అర్ధరాత్రి 12 గంటలకే విష్… ఎందుకో !

ప్రస్తుతం సమంత సౌత్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. నాగచైతన్య విడాకులు తర్వాత టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ల లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఒక వైపు సినిమాలు మరో వైపు వెంకటేశ్వర్లు అంటూ లైఫ్ని బిజీబిజీగా గడిపేస్తోంది ఈ బ్యూటీ. ఏప్రిల్ 28న గురువారం పుట్టినరోజు జరుపుకుంది సమంత. సోషల్ మీడియా వేదికగా పలువురు సెలబ్రిటీలు సమంత పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతా సోషల్ మీడియాలో సమంత పుట్టినరోజు సందడి బాగా కనిపించింది.

సమంతా కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారిలో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నారు. సమంతా కు తన మొదటి నుంచి అభిమాని అని చెప్పుకుంటున్న సాయి ధరమ్ తేజ్ బర్త్డే విషెస్ కూడా చాలా స్పెషల్ గా తెలియజేశారు.జెస్సీ నువ్వు ఏమాయ చేసావో కానీ.. ఏటో వెళ్లి పోయింది నా మనసు.. హ్యాపీ బర్త్ డే సామ్.. నిన్ను అమితంగా ఇష్టపడే వీరాభిమాని” అంటూ రాత్రి పన్నెండు గంటలకె విషెస్ తెలియ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

 

అయితే సాయి ధరమ్ తేజ్ పెట్టిన పోస్ట్ కు నేటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు పెడుతున్నారు. ఒకరైతే ఏంటి అన్నా 12 కే విష్, ఏదో తేడాగా ఉంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సాయి ధరమ్ తేజ్ తన అభిమాన నటి పుట్టినరోజు సందర్భంగా విష్ చేయడం వలన ఇలాంటి కామెంట్స్ ను ఎదుర్కోవలసి వస్తోంది.