డిజాస్టర్ “ఆచార్య”..రెండో రోజుకి షాకింగ్ వసూళ్లు..!

Acharya 2nd Day Collection : మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా మరో కీలక పాత్రలో దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా “ఆచార్య” కోసం తెలిసిందే. మెగా ఫ్యాన్స్ ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ మాస్ మల్టీ స్టారర్ ఎట్టకేలకు ఈ శుక్రవారం రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ ని కూడా అందుకుంది.
అయితే మొదటి రోజే పెద్ద ఎత్తున నెగిటివ్ టాక్ ఈ సినిమాకి సొంతం అయినా ఫస్ట్ డే మంచి నెంబర్ నే నమోదు చేసింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకి రెండో రోజు వసూళ్లు చూసేసరికి ట్రేడ్ వర్గాల వారు మరియు మెగా ఫ్యాన్స్ షాక్ లో నుంచి తేరుకోలేకపోతున్నారు. 100 కోట్లకి పైగా బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా రెండో రోజు దారుణాతి దారుణంగా పడిపోయింది.
మొదటి రోజే భీభత్సమైన నెగిటివ్ టాక్ రావడం వల్ల ఏమో కానీ రెండో రోజు అయితే ఇటీవల కాలంలో ఏ ప్లాప్ సినిమాకి కూడా రాని షాకింగ్ వసూళ్లు నమోదు అవుతున్నాయి. మొదటి రోజు నిజాం లో ఈ సినిమా 8 కోట్ల మేర షేర్ ని వసూలు చెయ్యగా రెండో 2 కోట్లు కూడా క్రాస్ చెయ్యకపోవడం అందరినీ షాక్ కి లోను చేసింది.
దీనితో అసలు ట్రేడ్ వర్గాల వారికి కూడా ఎక్కడా మాట రావడం లేదు. అలాగే మిగతా ఏరియాల్లో పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉందట. ఇదే పంథాలో చూసినట్టు అయితే చెప్పక తప్పదు గాని టాలీవుడ్ లో ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిపోతుందని అంటున్నారు. ఆ రేంజ్ నష్టాలు ఈ సినిమాకి తప్పవట. ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందివ్వగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.