రజినీకి అదిరే ఎలివేషన్ ఇచ్చిన సచిన్ టెండూల్కర్.!

ఆయా రంగాలకు సంబంధించి కొంతమంది లెజెండ్స్ ఉంటారు. అలా సినిమాల పరంగా సూపర్ స్టార్ రజినీకాంత్ అలాగే క్రికెట్ పరంగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లు కూడా ఉంటారు. అయితే మరి రజినీ ని నిన్న భారతదేశ ప్రభుత్వం దేశపు అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ పాల్కే పురస్కారంతో సత్కరించడం అందరికీ ఎంతో గర్వకారణంగా అనిపించింది. మరి ఈ ఘటనపైనే మాస్టర్ బ్లాస్టర్ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

“చాలా తక్కువ మందే తమ సినిమాలు వచ్చినప్పుడు ఒక రకమైన అలజడి సృష్టించగలరు. దానిని తలైవా రజినీకాంత్ ఎప్పుడూ చెయ్యగలరు. ఇలా తన వర్క్ ఆడియెన్స్ కోసం కంటిన్యూ చెయ్యాలి” అని అదిరే ఎలివేషన్ ని ఇచ్చి ఈ పురస్కారం రజిని అందుకున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసారు. మరి ప్రస్తుతం రజినీ నటించిన “పెద్దన్న” సినిమా దీపావళి కానుకగా రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.