Bheemla Nayak : వైరల్ : “భీమ్లా నాయక్” పై అదిరిపోయే సమాచారం ఇచ్చిన థమన్.!

Bheemla Nayak : ప్రెజెంట్ టాలీవుడ్ నుంచి రాబోతున్న పలు క్రేజీ మల్టీ స్టారర్ సినిమాల్లో గాడ్ ఆఫ్ మాసెస్ పవన్ కళ్యాణ్ మరియు టాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిస్తున్న చిత్రం “భీమ్లా నాయక్” కూడా ఒకటి. దర్శకుడు సాగర్ కే చంద్ర మలయాళ హిట్ సినిమా “అయ్యప్పణం కోషియం” కి రీమేక్ గా మరో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పర్యవేక్షణలో చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ భారీ సినిమా రిలీజ్ కి గాను ప్రస్తుతం కాస్త సస్పెన్స్ నెలకొనగా ఈ సినిమా సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ అదిరే సమాచారం అందించాడు. లేటెస్ట్ గా ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఇప్పటివరకు పూర్తి చేసిన షూటింగ్ తాలూకా అవుట్ పుట్ ని తాను త్రివిక్రమ్ తో కలిసి చూశానని ఇప్పటివరకు అదిరిపోయే విధంగా వచ్చిందని..

అలాగే పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ పెర్ఫామెన్స్ గా ఉంటుందని తెలిపాడు. దీనితో ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. మరి ఆల్రెడీ ఈ సినిమా అవుట్ పుట్ పై ముందే ఆసక్తికర టాక్స్ బయటకి వచ్చాయి ఇప్పుడు థమన్ కూడా కన్ఫర్మ్ చేసేసాడు ఇక థియేటర్స్ లో ఈ సినిమాని చూడడమే మిగిలి ఉంది.