Ukraine: ఉక్రెయిన్ పై ఏకంగా అన్ని క్షిపణులు ఉపయోగించిన రష్యా..?

Ukraine: ఉక్రెయిన్ రష్యా చేస్తున్న దాడులు ఆగడం లేదు. ఇప్పటికే ఈ దాడుల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఉక్రెయిన్ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ముందుగానే అన్ని రకాలుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంది అమెరికా. అందుకోసం భారీగా క్షిపణులను ప్రయోగిస్తోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ ఫై రష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా 470 క్షిపనులు ఉపయోగించినట్లు అమెరికా తాజాగా ఒక ప్రకటనలో తెలిపింది.

వాటిలో 230 క్షిపనులను ఉక్రెయిన్ లోని మొబైల్స్ వ్యవస్థల ద్వారా,150 భాష భూభాగం లో నుంచి,70 బెలారస్ నుంచి, మరికొన్నింటిని నల్ల సముద్రం లోని నౌకల ద్వారా రష్యా ప్రయోగించినట్లు తెలిపింది. ఇక వాటిని ఉక్రెయిన్ లోని క్షిపణి విధ్వంసక దళాలు ఎదుర్కొనే ప్రయత్నం చేస్తామని తెలిపింది. రష్యా బలగాలు ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలో దాడులకు తెగబడుతున్న దూసుకుపోతున్నప్పటికీ, ఉత్తర ప్రాంతంలో మాత్రం ఎదురు దెబ్బలు తింటున్నారని అమెరికా తాజా ప్రకటనలో తెలిపింది. ఇక ఆ ప్రాంతంలో ఉక్రెయిన్ సేనలు బలంగా ఉండటం వల్ల ఆ ప్రతిఘటన ఎదురవుతోంది అని వివరించింది అమెరికా.