Big Boss 6 : బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ లిస్ట్ ఫైనల్..? ఎవరెవరు పాల్గొంటున్నారు..?

Big Boss 6 : బుల్లి తెరమీద ప్రసారమైన రియాలిటీ షోలలో బిగ్ బాస్ కి ప్రత్యేక స్థానం ఉంది. బిగ్ బాస్ రియాలిటీ షో కి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ వంటి అన్ని భాషలలో ప్రసారం అవుతున్న ఈ బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగులో కూడా మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. ఇప్పటికే తెలుగులో బిగ్ బాస్ 5 సీజన్ లు టెలివిజన్ లో ప్రసారమయ్యాయి. అంతేకాకుండా ఓటిటిలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ ఇటీవల ముగిసింది. ఈ నాన్ స్టాప్ సీజన్ పూర్తి కాకముందు నుండే బిగ్ బాస్ సీజన్ 6 గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 6 తొందర్లోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సీజన్ 6 లో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సీజన్ సిక్స్ లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు కూడా పాల్గొనే అవకాశం కల్పించారు. అందువల్ల చాలామంది సామాన్య ప్రజలు బిగ్ బాస్ లో పాల్గొనటానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్ ల లిస్ట్ బయటకి వచ్చింది. ఈ సీజన్ లో చాలా మంది కొత్తవారు పాల్గొంటున్నారు.

అయితే బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్ ల వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రముఖ యాంకర్ మంజుషా, హీరోయిన్ ఆశా సైనీ, న్యూలి మేరీడ్ సినిమా ఫేమ్ సంజన చౌదరి, యూట్యూబర్ కుషిత కల్లపు, సింగర్ మోహన భోగరాజు, జబర్ధస్త్ వర్ష, కొరియోగ్రాఫర్ పొప్పీ మాస్టర్ యాంకర్ రోషన్, వలయం సినిమా ఫేమ్ హీరో లక్ష్య చదలవాడ, బుల్లితెర నటి కరుణ భూషణ్, బుల్లితెర నటుడు కౌశిక్, యూట్యూబర్ శ్రీహాన్, మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్ చైతన్య గరికపాటిలు వంటి వారు బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొని సందడి చేయబోతున్నట్టు సమాచారం. మరి ఇ ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.