Pithapuram: పిఠాపురంలో షాడో ఎమ్మెల్యే….. పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టనున్నారా?

Pithapuram: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా పిఠాపురం నియోజకవర్గ నుంచి ఎన్నికల బరిలోకి దిగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈ ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని సాధించారు అలాగే కూటమి పార్టీలు కూడా మంచి విజయం సాధించి అధికారాన్ని కూడా అందుకున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా ఏపీ డిప్యూటీ సీఎం గా మంత్రిగా కూడా బాధ్యతలు చేసుకున్నారు.

ఇలా పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలిచినప్పటికీ పెద్దగా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేరని చెప్పాలి గెలిచిన తర్వాత మొదటి మూడు రోజులు ఆయన పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉన్నారు. అయితే మరో నాలుగు సార్లు పిఠాపురంలో పర్యటించిన కేవలం కొన్ని గంటల సమయం మాత్రమే ఆయన పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉన్నారు.

ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎం గాను అలాగే మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి రావటం అలాగే మరికొన్ని కర్తవ్యాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉండలేకపోతున్నానంటూ పవన్ కళ్యాణ్ ఓ బహిరంగ సభలో వెల్లడించారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడం కోసం మర్రెడ్డి శ్రీనివాసరావు అనే నాయకుడిని నియమించారు.

ఇలా శ్రీనివాస్ రావు మాత్రం ఇప్పుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని పిఠాపురం జనసైనికులతో పాటు తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. శ్రీనివాసరావు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గానికి చెందిన వారు. అయితే ఈయన పిఠాపురం బాధ్యతలను తీసుకోవడంతో ఇక్కడ పరిస్థితులు ఆయనకు తెలియని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు.

ఈయన మెగా బ్రదర్ నాగబాబుకు సన్నిహితుడని పార్టీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు మర్రెడ్డి శ్రీనివాసరావుకు, టీడీపీ పిఠాపురం ఇంచార్జి వర్మకు మధ్య పొసగడం లేదు వీరిద్దరూ ఏ కార్యక్రమానికి కలిసి వెళ్లిన పెద్ద ఎత్తున వివాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో నియోజకవర్గ ప్రజల సహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రీనివాస్ రావు తానే ఎమ్మెల్యేగా ఫీల్ అవుతూ ఉన్నారని ఈయన తీరు కారణంగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కి కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు ఉన్నాయి అంటూ జన సైనికులు ఈ విషయంపై స్పందిస్తూ పవన్ ఇప్పటికైనా షాడో ఎమ్మెల్యే పట్ల తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.