RRR Trailer : మూడు నిమిషాల ట్రైలర్ సినిమాటిక్ మ్యాజిక్!

RRR Trailer : రాజమౌళి -ఎన్టీఆర్ -రామ్ చరణ్ ల మెగా బ్లాస్టింగ్ ‘ఆర్ ఆర్ ఆర్’ ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలై సూపర్ వైరల్ అవుతోంది. ఆన్ లైన్ తో బాటు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో కూడా రిలీజైంది. ట్రైలర్ చూడడానికి వచ్చే అభిమానుల తాకిడిని తట్టుకోలేమని ముందే వూహించిన థియేటర్ల

యాజమాన్యాలు పోలీసు రక్షణ కోరే దాకా ఈ ట్రైలర్ విడుదల దుమారం రేపుతోంది. ‘బాహుబలి -1, 2’ లతో పానిండియా గుర్తింపు పొందిన దర్శకుడు రాజమౌళి మేకింగ్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ ని మరో మాగ్నమ్ ఓపస్ గా భావిస్తున్న నార్తిండియా ప్రేక్షకులు, మీడియా ఈ ట్రైలర్ ని ఆకాశాని కెత్తేస్తున్నారు.

ట్రైలర్ తో రాజమౌళి మాస్టర్ స్కిల్స్ మరోసారి రుజువయ్యాయి. విజువల్స్, స్కేల్, సౌండ్, సూపర్‌ఫాస్ట్ షాట్స్, ఎడిటింగ్, కాస్ట్యూమ్స్ అన్నీ వూపిరిబిగబట్టి చూసేలా వున్నాయి. ఇద్దరు భారతీయ విప్లవకారుల పాత్రల్లో అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్, కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ ట్రైలర్ యావత్తూ కాక పుట్టించారు. బ్రిటిష్ వాళ్ళకి చుక్కలు చూపించారు.

ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అవుతుంది : పార్లమెంటు భవనం వైపు ఇంగ్లీష్ మిలటరీ మార్చ్ విజువల్స్ అవుతూండగానే, కండలు తిరిగిన జూనియర్ ఎన్టీఆర్ అడవిలో పరిగెడుతూ పులితో పోరాడే థ్రిల్లింగ్ షాట్ వస్తుంది. రామ్ చరణ్ పోలీసాఫీసర్ గెటప్ లో గ్రాండ్ గా ఎంటరవుతాడు. ఇద్దరి అల్లూరి – కొమరం బాండింగ్, స్నేహం, సరదాలు భావోద్వేగ బంధాన్ని తెలిపే మాంటెజెస్ వరసగా వస్తాయి. ఒక సన్నివేశంలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ వస్తాడు. బ్రిటిష్ వాళ్ళ హింస, జనం అల్లాడిపోవడాలు, ఇక లాభంలేదని అల్లూరి – కొమరం జంట విప్లవ శంఖం పూరించి ప్రాణాలకు తెగించి పోరాటంలోకి దూకడం, మధ్య మధ్యలో హీరోయిన్ ఆలియా భట్ తో పోయేటిక్ లవ్ ట్రైలర్ ని వేగంగా పరుగెత్తిస్తాయి.

RRR Trailer (Telugu) - NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt | SS Rajamouli | 25th March 2022

 

ట్రైలర్ రిచ్ గా వుంది. కానీ కొన్ని చోట్ల VFX పేలవంగా అనిపిస్తుంది, ముఖ్యంగా చివరి సన్నివేశాలలో జూనియర్ ఎన్టీఆర్ తన మోటార్‌ బైక్‌తో చేసే పోరాట విజువల్స్. VFX లో చిన్న చిన్న లోపాల మధ్య చిత్రీకరించిన పోరాట సన్నివేశాలు మాత్రం థ్రిల్లింగ్ గా కొరియోగ్రాఫ్ చేశారు. ఎంఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌కి మరో ప్రధాన ఆకర్షణ. రాజమౌళి నుంచి భారతదేశపు అతిపెద్ద యాక్షన్ డ్రామాగా కల్పిత చరిత్ర ‘ఆర్ ఆర్ ఆర్’ జనవరి 7, 2022న విడుదలవుతోంది. ఎన్టీఆర్ జూనియర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, ఆలియా భట్, ఒలివియా మోరిస్, సముద్రఖని, అలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ శ్రియా శరణ్ ఇతర నటవర్గం.

ఇద్దరు ప్రసిద్ధ భారతీయ విప్లవకారులైన అల్లూరి సీతారామ రాజు (చరణ్), కొమరం భీమ్ (రామారావు) ల గురించిన కల్పిత కథ ఇది. ఇద్దరూ బ్రిటిష్ ప్రభుత్వానికి, నిజాం రాజ్యానికీ వూయతిరేకంగా పోరాడే వీరుల పాత్రల్లో అభిమానుల్ని ఉత్తేజపరుస్తారు.