RRR : ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం భారతదేశమంతా ఉత్కంఠగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తోంది. పాన్ ఇండియా సినిమా కావడమే అందుక్కారణం. ప్రమోషన్స్ జోరందుకున్నాయి. రాజమౌళి, ‘బాహుబలి’ తర్వాత మళ్ళీ అంతటి విజయాన్ని ఈ సినిమాతో అందుకుంటాడా.? లేదా.? చరణ్ – ఎన్టీయార్ కలిసి నటిస్తోన్న ఈ మల్టీస్టారర్, ఇండియన్ సినిమా స్క్రీన్‌పై ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోంది.? ఇలా చాలా ప్రశ్నలున్నాయ్.
అన్నటికీ సమాధానం త్వరలోనే దొరకబోతోంది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. జక్కన్న రాజమౌళి, సినిమాని ఎంత బాగా తీర్చిదిద్దుతాడో, అంతే బాగా ప్రమోషన్స్‌ని కూడా డిజైన్ చేస్తాడు. ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా అంతే.
చరణ్, ఎన్టీయార్, అలియా భట్.. వీళ్ళే కాదు, అజయ్ దేవగన్ సహా ఇతర ప్రధాన తారాగణంతో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. దేశంలో పలు నగరాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఇదంతా ఓ యెత్తు, కోవిడ్ 19 మూడో వేవ్ అనుమానాలు ఇంకో యెత్తు.
‘అఖండ’ సినిమా సక్సెస్ తర్వాత, తెలుగు సినీ పరిశ్రమకి కొత్త ధైర్యం వచ్చింది. అయినాగానీ, సినిమా అంటేనే సున్నితమైన అంశం. ఏ చిన్న భయమైనా, సినిమా పరిశ్రమని దెబ్బతీయొచ్చు. భారీ అంచనాలు, బోల్డంత హంగామా.. ఇవన్నీ వెరసి, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి తొలి రోజు ప్రభంజనం లాంటి వసూళ్ళను తెచ్చపెట్టొచ్చు.. కానీ, కరోనా భయాలు లేకపోతేనే.
ఏమో, ముందు ముందు ఏం జరుగుతుందో చెప్పలేంగానీ, ఆర్ఆర్ఆర్ టీమ్ మాత్రం, శక్తి వంచన లేకుండా ప్రమోషన్స్ విషయంలో పనిచేస్తోంది.