ఇన్‌సైడ్ టాక్: ఆర్ఆర్ఆర్ ట్రైలర్.. అదిరిపోయిందట.!

రాజమౌళి నుంచి ఏ సినిమా షురూ అయినా, టైటిల్ దగ్గర్నుంచి.. సినిమా విడుదలయ్యేదాకా.. అన్ని విషయాల్లోనూ విపరీతమైన హైప్ క్రియేట్ అవుతుంటుంది. పాన్ ఇండియా దర్శకుడు.. అంతేనా, హాలీవుడ్ స్థాయి ఆలోచనలతో సినిమాల్ని తెరకెక్కిస్తుంటాడు రాజమౌళి.

‘బాహుబలి’కి మందు, ‘బాహుబలి’ తర్వాత.. అన్నట్టు మారిపోయింది ఇండియన్ బాక్సాఫీస్ లెక్కల వ్యవహారం. మరిప్పుడు, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రాజమౌళి ఏం మ్యాజిక్ చేయబోతున్నాడు.? ప్రమోషనల్ సాంగ్, సీతారామరాజు ఇంట్రడక్షన్, కొమరం భీమ్ ఇంట్రడక్షన్.. ఇలా అన్నిటిలోనూ దేనికదే ప్రత్యేకం.. అని నిరూపించి, వాటితో సంచలనాలు సృష్టించిన రాజమౌళి, ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్‌ని కూడా అంతకు మించి.. అనే స్థాయిలో తీర్చిదిద్దాడట.

ట్రైలర్ ఫైనల్ కట్ ఇటీవలే పూర్తయ్యిందనీ, నభూతో న భవిష్యతి.. అనే స్థాయిలో ట్రైలర్ వచ్చిందనీ ఇన్‌సైడ్ సోర్సెస్ చెబుతున్నాయి. బీజీఎం (బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్), ఎడిటింగ్.. ఇలా ప్రతి విషయాల్లోనూ రాజమౌళి చాలా చాలా స్పెషల్ కేర్ తీసుకున్నాడట. మైండ్ బ్లోయింగ్ విజువల్స్ ట్రైలర్‌లో చూడబోతున్నామట.

రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీయార్, అలియా భట్, అజయ్ దేవగన్ తదితరులు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ప్రధాన తారాగణం. ట్రైలర్‌కి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.