Rajamouli: ఒకరిని ఒకరు గిల్లుకుంటున్న చెర్రీ, ఎన్టీఆర్, జక్కన్నా.. పెళ్ళాలకు విడాకులు ఇచ్చి పెళ్లి చేసుకొండంటూ ట్రోల్స్!

Rajamouli: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిత్రం RRR గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు జనవరి ఏడో తేదీ విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ క్రమంలోనే శనివారం హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా చిత్రబృందం ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ మీడియాకు రామ్ చరణ్ ఎన్టీఆర్ లపై ఒక ఫిర్యాదు చేశారు. ఈ సినిమాలో దాదాపు 300 రోజు షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేసారు కానీ వీరి వల్ల 25 రోజులు వృధా అయిపోయిందని రాజమౌళి తెలిపారు.

ఇక ఇలా రాజమౌళి వారి గురించి మాట్లాడుతున్న సమయంలో ఎన్టీఆర్ రాజమౌళికి గిళ్లడంతో రాజమౌళి అక్కడి నుంచి పక్కకు లేచి వారి బాగోతం బయట పెట్టారు. ఇలాగే సెట్ లో వీరిద్దరు గొడవ కారణంగా 25 రోజులు సినిమా షూటింగ్ వృధాగా మారిపోయింది అని తెలిపారు.వీరిద్దరికీ 30 సంవత్సరాలు వచ్చాయి పెళ్లిళ్లు కూడా అయిపోయాయి వెనక బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అయినా సెట్ లో చిన్నపిల్లల మాదిరి వచ్చి నాకి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎన్టీఆర్ తన దగ్గరకు వచ్చి జక్కన్న చూడు చరణ్ నన్ను గిల్లాడు అంటూ కంప్లీట్ చేయగా..ఆయన మాత్రం తనకి ఏమీ తెలియదు అన్నట్టుగా నేను స్క్రిప్ట్ చదువుతున్నాను అంటూ అమాయక ఫేస్ పెడతారు అంటూ తెలిపారు.

ఇలా వీరిద్దరి కారణంగా తనకు 25 రోజులు సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యిందని ఈ సందర్భంగా రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ గురించి ఈ ప్రెస్ మీట్లో వెల్లడించారు.ఇక ప్రస్తుతం రాజమౌళి చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు ఈ వీడియో పై స్పందిస్తూ ఎన్టీఆర్ రామ్ చరణ్ భార్యకు విడాకులు ఇచ్చి వీరిద్దరికీ పెళ్లి చేయాలి అంటూ పెద్ద ఎత్తున ఈ విషయంపై ట్రోల్స్ చేస్తున్నారు.