RRR : మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా “రౌద్రం రణం రుధిరం”. ఎనలేని అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేసిన లాస్ట్ మినిట్ లో మేకర్స్ తప్పక వాయిదా వేశారు.
దీనితో రిలీజ్ పట్ల మరింత ఆసక్తి నెలకొనగా తాజాగా ప్రముఖ స్టార్ నటుడు మాధవన్ మరియు ఈ “RRR” సోషల్ మీడియా యూనిట్ కి ఇంట్రెస్టింగ్ రిప్లై లు ఇచ్చారు. మరి అలా సినిమా రిలీజ్ కోసం అడగ్గా దానికి కూడా వారు సమాధానం ఇచ్చారు.
“మేము అల్రెడీటీ రెడీగానే ఉన్నాం, కానీ ఆ బ్లాస్ట్ కోసమే ఎదురు చూస్తున్నాం సర్. ఇప్పుడు ఈ థియేటర్స్ సమస్య కానీ తీరిపోతే వీలైనంత త్వరగానే సినిమాని బిగ్ స్క్రీన్స్ పై రిలీజ్ చేస్తాం.” అని క్లారిటీ ఇచ్చారు.
మేకర్స్ కూడా ఎప్పుడు నుంచో సినిమాని రిలీజ్ చెయ్యాలని ఆసక్తిగా ఉన్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ కి పరిస్థితులే అనుకూలించాల్సి ఉంది. మరి అవి సాధ్యమైనంత త్వరగా క్లియర్ అయ్యి రిలీజ్ కావాలని ఆశిద్దాం.