బిగ్గెస్ట్ అప్డేట్ : మోస్ట్ అవైటెడ్ “RRR” ట్రైలర్ ఎప్పుడో తెలుసా.?

Rrr Movie Trailer Launch Details Is Here | Telugu Rajyam

పాన్ ఇండియన్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పలు భారీ చిత్రాల్లో దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లతో తీసిన బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి. వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ ని స్టార్ట్ చేయనున్న ఈ భారీ సినిమా ఇప్పుడు అదిరే ప్రమోషన్స్ ని జరుపుకుంటుంది.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంలోని మూడో సాంగ్ ని కూడా చిత్ర బృందం ఈరోజు స్పెషల్ స్క్రీనింగ్స్ వేసి మరీ భారీ లెవెల్ ప్రమోషన్స్ ని చేస్తున్నారు. అయితే ఈ వేడుకతోనే ఈ సినిమాకి చెందిన బిగ్గెస్ట్ అప్డేట్ పై లేటెస్ట్ సమాచారం తెలిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి ఈ సినిమా ట్రైల్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది రివీల్ చేశారు.

వచ్చే డిసెంబర్ మొదటి వారంలోనే ఈ మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ రిలీజ్ ఉంటుందట. అంతే కాకుండా ఇది కూడా స్పెషల్ స్క్రీనింగ్స్ లో ఉండొచ్చని కూడా బజ్ ఉంది. మొత్తానికి అయితే ఇంకా దీని తాలూకా డేట్ మాత్రమే అనౌన్స్ కావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందివ్వగా డీవీవీ దానయ్య నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles