RRR Trailer :”RRR” ట్రైలర్ : ఇండియన్ బాక్సాఫీస్ కి రెస్ట్ ఇన్ పీస్ అంతే..

RRR Trailer : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ ప్రౌడ్ ఇండియన్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) నుంచి ఇపుడు మోస్ట్ అవైటెడ్ గా బిగ్గెస్ట్ ఏక్షన్ థ్రిల్లర్ ట్రైలర్ ని చిత్ర బృందం అనూహ్యంగా ఈరోజు చాలా ముందే రిలీజ్ చేసేసారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు స్వతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీం లగా నటించిన ఈ సినిమా నుంచి ట్రైలర్ ఎలా ఉందో అంచనాలు రీచ్ అయ్యిందో లేదో చెప్పాలిగా..

RRR Trailer (Telugu) - NTR, Ram Charan, Ajay Devgn, Alia Bhatt | SS Rajamouli | 25th March 2022

మొత్తం మూడు నిముషాలు ప్లాన్ చేసిన ఈ ట్రైలర్ కట్ ఇంకో లెవెల్లో ఉందని చెప్పాలి. మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో రాజమౌళి దీనిని కట్ చేసి ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా ఇద్దరు హీరోల అసలు అవతార్ లను ఈ ట్రైలర్ లో రివీల్ చేసి చూపించడం సినిమాపై మరింత హైప్ ని తీసుకొస్తుంది. భీమ్ ప్రాంతం నుంచి మొదలై.. ఇద్దరి స్నేహ బంధంతో వారి వైరంతో నెక్స్ట్ లెవెల్ విజువల్స్ ఈ ట్రైలర్ కనిపిస్తుంది.

ఎన్టీఆర్ పులితో ఫైట్ సీన్ కానీ అల్లూరిగా రామ్ చరణ్ మేకోవర్ లో తారక్ తో కలిసి బ్రిటిషర్లు పై చేసిన యుద్ధ సన్నివేశాలు కానీ రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తున్నాయి. ఇంకా రాజమౌళి రాబట్టిన ఎమోషన్స్ ఎన్టీఆర్ చరణ్ ల ప్రెజెన్స్ అదిరిపోయాయి. అలాగే ఎం ఎం కీరవాణి సంగీతం కానీ దానయ్య గారి నిర్మాణ విలువలు కానీ అత్యుత్తముగా అనిపిస్తున్నాయి. మొత్తంగా అయితే వచ్చే జనవరి 7న మళ్ళీ ఇండియన్ బాక్సాఫీస్ కి రెస్ట్ ఇన్ పీస్ అని చెప్పాల్సిందే.