RRR : ఆ స్టార్ హీరోకి “RRR” మొత్తం యూనిట్ థాంక్స్ చెప్పారు.. ఎందుకంటే?

RRR : టాలీవుడ్ ఇద్దరు పవర్ ఫుల్ మాస్ హీరోలు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో అంతే మాస్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అనౌన్స్ చేసిన భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR). భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మరి ఈ భారీ సినిమా ఎప్పుడు నుంచో రిలీజ్ ని అనేక సార్లు వాయిదా వేసుకుంటూ వెళ్తుండగా ఫైనల్ గా ఈ మార్చ్ 25కి ఈ సినిమా రిలీస్ ఫిక్స్ అయ్యింది. మరి ఇలాంటి భారీ సినిమా థియేటర్స్ లోకి వస్తుంది అంటే ఇతర సినిమాలు కొన్ని ఆగిపోక తప్పదు. మరి గతంలో జనవరి సంక్రాంతి రేస్ లో రిలీజ్ కి అనౌన్స్ చెయ్యగా అప్పటికి ఉన్న పలు సినిమాలు వాయిదా పడ్డాయి.
ఇక ఇప్పుడు మళ్ళీ మార్చ్ 25కి కూడా కొన్ని సినిమాలు వాయిదా పడడం కన్ఫర్మ్ కాగా వాటిలో తమిళ ఇండస్ట్రీకి చెందిన హీరో శివ కార్తికేయన్ నటించిన సినిమా “డాన్” కూడా ఉంది. అయితే ఈ సినిమాని స్వచ్చందంగా “RRR” కోసం వాయిదా వేస్తున్నామని కన్ఫర్మ్ చేశారు.
ఈ భారీ సినిమాని తమిళ్ కొనుగోలు చేసిన నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ హౌస్ వారే కార్తికేయన్ సినిమా కూడా నిర్మాణం వహించారు. దీనితో హీరో సూచనతోనే తమ సినిమాను వాయిదా వేస్తున్నామని ప్రకటన ఇచ్చారు. దీనితో మళ్ళీ మా సినిమాకి సపోర్ట్ గా నిలిచినందుకు హీరో శివ కార్తికేయన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని మాకోసం మీరెప్పుడూ మొదటి వరుసలో ఉంటారని తెలిపారు.
https://twitter.com/RRRMovie/status/1498866316182454275?s=20&t=38EcjmwMhRVMX_kn_BZiMQ