KGF 2 : “కేజీయఫ్ 2” వచ్చినా ఆశ్చర్యపరుస్తున్న “RRR” వసూళ్లు..!

KGF 2 :  జెనరల్ గా పలు సినిమాలు పెర్ఫామెన్స్ ఎలా ఉంటాయి అంటే అవి ఎంత పెద్ద హిట్ అయినా కొన్ని రోజులు అయ్యాక మరో భారీ సినిమా వచ్చింది అంటే ఇక ఆరోజు నుంచి దానికి ఎండ్ కార్డు పడినట్టే అని చెప్పాలి. కాయాన్ని అలాంటివి వచ్చినా కొన్ని సినిమాలు మాత్రం గట్టిగా నిలబడేది మాత్రం అరుదుగా కనిపిస్తుంది.
అలాగే ఇదే తరహాలో భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కి కూడా మరో బిగ్గెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “కేజీయఫ్ చాప్టర్ 2” వచ్చాక జరుగుతుంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా రాజమౌళి సినిమాకి ఇలా జరగక పోగా పైపెచ్చు ఈ సినిమా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
తెలుగు స్టేట్స్ లో కేజీయఫ్ 2 కి కూడా భారీ డిమాండ్ ఉంది. ఇది వచ్చాక ట్రిపుల్ ఆర్ ని ఎవరు పట్టించుకు అనుకున్నారు కానీ ఈ సినిమాకి మాత్రం అది ఉన్నా కూడా ఉన్న థియేటర్స్ లో మంచి వసూళ్లు రాబడుతూ బాక్సాఫీస్ దగ్గర నిలకడగా అదరగొడుతుంది.
పోనీ మన దగ్గరే అనుకుంటే కేజీయఫ్ వచ్చాక కూడా హిందీలో మినిమమ్ 3 కోట్లు RRR నెట్ వసూళ్లు ప్రతి రోజు రాబడుతుంది అంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అయ్యిందో అనేది.
ఒకవేళ కేజీయఫ్ గాని లేకుండా ఉంటే మరింత మంచి వసూళ్లు ఈ సినిమాకి దక్కి ఉండేవి అయినా మంచి కలెక్షన్ ని ఈ సినిమా రాబడుతూ ట్రేడ్ వర్గాలకి షాకిస్తుంది.