RRR Movie Sets : “బాహుబలి 2” తర్వాత ఆన్లైన్ లో ఇండియా రికార్డ్ కొట్టిన “RRR”.!

RRR Movie Sets : ఇప్పుడు భారత దేశ సినిమాని మన తెలుగు సినిమానే ఏలుతుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఈ హవా కూడా ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ “బాహుబలి 2” నుంచే స్టార్ట్ అయ్యిందని కూడా తెలిసిందే. అయితే ఈ భారీ సినిమా అనంతర ఈ సినిమా దర్శకుడు రాజమౌళి మరియు ప్రభాస్ ల రేంజ్ లు కూడా మారిపోయాయి.
దీనితో వారి బ్రాండ్ తోనే వారు టేకప్ చేసిన సినిమాలకి భారీ స్థాయి హైప్ నెలకొంటుంది. అలాగే ఇప్పుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి మాసివ్ హీరోస్ తో చేసిన భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) పై భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి.
మరి అపుడు బాహుబలి 2 తో ఆన్లైన్ లో ఏ రేంజ్ సెన్సేషన్ ని రీపాడో ఇప్పుడు ఈ సినిమాతో కూడా రాజమౌళి అంచనాలు పెంచుతున్నాడని చెప్పాలి. దానికి నిదర్శనమే ఈ ట్రిపుల్ ఆర్ సినిమా కూడా బుక్ మై షో లో 1 మిలియన్ లైక్స్ ని క్రాస్ చెయ్యడం.
ఇది బాహుబలి 2 తర్వాత మాత్రమే కాకుండా మన ఇండియన్ సినిమా దగ్గరే మరో బిగ్గెస్ట్ రికార్డు అట. ఇలా ఈ సినిమా రిలీజ్ కి ముందే ఎన్నో సెన్సేషన్ లని నమోదు చేస్తుంది. ఇక రిలీజ్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందో అని అభిమానులు ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.