RRR : యూఎస్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం రేపుతున్న “RRR” టికెట్ బుకింగ్స్!

RRR : మరోసారి ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా చాటే రోజులు అత్యంత చేరువలో ఉన్నాయి. పైగా ఈ లిస్ట్ లో ఒకే నెలలో మన నుంచి రెండు భారీ సినిమాలు ఉండగా వాటిలో దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తీసిన విజువల్ అండ్ ఏక్షన్ స్పెక్టాక్యూలర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) ఒకటి.
అయితే ఒక రాజమౌళి సినిమాకి ఏ స్థాయి అంచనాలు ఉండాలో అంతకు మించే ఈ భారీ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఇరు స్టార్ట్ హీరోలు రామ్ చరణ్ మరియు తారక్ ల అభిమానులు సహా అందరి హీరోల అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ భారీ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో కూడా తన దమ్ము చూపిస్తున్నారు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఊహించని రేంజ్ లో ఈ సినిమాకి మళ్ళీ బుకింగ్స్ నమోదు అవుతున్నాయట. లేటెస్ట్ గా అయితే ఈ సినిమా ఏకంగా 1 మిలియన్ డాలర్స్ మార్క్ ని ప్రీ సేల్స్ లో కొట్టేసిందట. అంతే కాకుండా అక్కడి సినీ మార్క్ చైన్ లో మాత్రమే ఏకంగా హాఫ్ మిలియన్ డాలర్స్ మార్క్  ఏకైక సినిమాగా ఇది రికార్డు నెలకొల్పినట్టు కూడా ఇప్పుడు తెలుస్తుంది.
దీని బట్టి ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో సంచలనం నమోదు చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, ఆలియా భట్ లు హీరోయిన్స్ గా నటించగా సముద్రఖని, శ్రేయ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం మార్చ్ 25న రిలీజ్ కాబోతుంది.