Theater Owners : ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ స్థాయి అంచనాలు నెలకొల్పుకున్నా భారీ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ట్రిపుల్ ఆర్(RRR) అనే చెప్పాలి. మరి ఈ భారీ సినిమాలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించారు.
అయితే ఈ సినిమా రిలీజ్ మరికొన్ని రోజుల్లో మాత్రమే వచ్చేస్తుండగా టోటల్ ఇండియన్ సినిమా దగ్గరే అన్ని భాషల్లోనూ భారీ స్థాయి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఎన్ని చోట్ల అయినా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం జరిగే సెలెబ్రేషన్స్ వేరే లెవెల్లో ఉంటాయి.
అందుకే థియేటర్స్ వారు బెంబేలెత్తిపోతున్నారు. పైగా ఇది ఇద్దరు హీరోల సినిమా కావడంతో మరింత భయపడుతున్నారు. ఎంత కలివిడిగా ఉన్నా ఎక్కడో ఒక చోట ఇరు వర్గాల మధ్య పోటీ నెలకొంటే పరిస్థితి ఏంటి అని ముందే జాగ్రత్త తీస్కొని అభిమానులని హెచ్చరిస్తున్నారు.
ఇద్దరు హీరోలకి కలిపి ఫ్లెక్సీలు గాని కటౌట్స్ గాని పెడితేనే థియేటర్స్ దగ్గర పెట్టుకోవాలని లేకపోతే పెట్టొద్దు అని ముందే చెప్తున్నారు. అలాగే మరికొన్ని చోట్ల అయితే థియేటర్స్ లోపల ఏకంగా ముందు అభిమానులని తెర దగ్గరకి వెళ్లనివ్వకుండా కింద మేకుల మ్యాట్ లు అలాగే తెర దగ్గర ముళ్ల కంచెలు వేసుకుంటున్నారు.
దీనితో ఇవి మరింత ఆసక్తిగా మారిపోయాయి. ఇలా అభిమానులు నుంచి తమ థియేటర్స్ కి జరిగే నష్టాల నుంచి కాపాడుకోడానికి ఇలా కొత్త దారులు తొక్కుతున్నారు. ఇవి ఓ రకంగా కంట్రోల్ చేసే అంశాలే అని చెప్పాలి.