వైరల్ అవుతున్న ‘RRR’ లో పవర్ఫుల్ డైలాగ్.!

ఇప్పుడు ఆల్రెడీ ట్రిపుల్ ఆర్(RRR) సినిమా నుంచి వచ్చిన రెండో పాటకి చెందిన ప్రోమో తో మాస్ ఆడియెన్స్ మంచి ఊపులో ఉన్నారు. ఇక అలానే ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందం కోసం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ వీరిని పక్కన పెడితే అసలు ఈ సినిమాకి రియల్ హీరోనే దర్శకుడు రాజమౌళి సినిమాని తెరకెక్కించడం నుంచి ఆడియెన్స్ కి ప్రెజెంట్ చెయ్యడం వరకు కూడా రాజమౌళి ప్లానింగ్ లు నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఈ సినిమాలో ఒక డైలాగ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనిని స్వయంగా రాజమౌళినే చెప్పారు. “యుద్ధాన్ని వెతుక్కుంటుంటూ ఆయుధాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి”. వినడానికే ఈ డైలాగ్ పవర్ ఫుల్ గా అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రచయిత సాయి మాధవ్ బుర్రా ఇంకెలాంటి డైలాగ్స్ అందించారో మనం అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి మాత్రం ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా నుంచి ఈ డైలాగ్ సినీ వర్గాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.