RRR : “RRR”కి విదేశీ గడ్డపై మెంటల్ మాస్ ప్లానింగ్.. ఏంటో తెలుసుకోండి.!

RRR: ఒక్క ఇండియన్ సినిమా మాత్రమే కాకుండా భారతీయుడు ఉన్న ప్రతి చోట కూడా ఎన్నో అంచనాలు తో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్(RRR). ఇండియన్ టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోలతో తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ ఏక్షన్ డ్రామా వచ్చే జనవరి 7న రికార్డ్ స్థాయిలో రిలీజ్ కానుంది.
అయితే మన దేశంలో సహా ప్రపంచ వ్యాప్తంగా 10 వేలకు పై చిలుకు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం విదేశీ గడ్డ అయినటువంటి అమెరికాలో మాత్రం నెక్స్ట్ లెవెల్ రిలీజ్ అవుతుందట. అక్కడ ఏకంగా 1000 మల్టీ ప్లెక్సు లలో రిలీజ్ చేసే ప్లాన్ రాజమౌళి చేశాడట. ఇది ఇండియన్ సినిమాల్లో ఈ మధ్య కాలంలో దేనికి కూడా జరగలేదు. అయితే ఈ స్థాయి రిలీజ్ ఎందుకు అంటే మళ్లీ ఇండియన్ సినిమా పూర్వ వైభవం అక్కడ కూడా తీసుకురావాలని ప్లానింగ్ అట.
ఆల్రెడీ అక్కడ కూడా భారీ బిజినెస్ ని ఈ చిత్రం జరిపింది. మరి ఈ భారీ సినిమా రిలీజ్ అయ్యాక అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ భారీ సినిమాలో అజయ్, ఆలియా భట్, సముద్ర కని, ఒలివియా మోరీస్ తదితరులు నటించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు. అలాగే డివివి దానయ్య నిర్మాణం అందించారు.