RRR : “RRR” మాస్ సాంగ్ సెన్సేషన్..భారీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.!

RRR : పాన్ ఇండియా వీక్షకులు ఎంతో ఆసక్తిగా రసవత్తరంగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక దిగ్గజం ఇండియాస్ టాప్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తీసిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి. అనేక అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రం ఈరోజు నుంచి చూసుకుంటే ఇంకా సరిగ్గా నెల రోజుల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
మరి ఈ గ్యాప్ లో ఈ సినిమా సెన్సేషన్ మాత్రం తగ్గడం లేదని చెప్పాలి. ఎన్టీఆర్, చరణ్ లపై సంగీత దర్శకుడు కీరవాణి ఇచ్చిన పక్కా మాస్ సాంగ్ “నాటు నాటు” అన్ని భాషల్లో సూపర్ హిట్ రెస్పాన్స్ ని తెచ్చుకున్న ఈ పాట లేటెస్ట్ గా 200 మిలియన్ సెన్సేషనల్ వ్యూస్ మార్క్ ని టచ్ చేసి ఇంకో రికార్డు ని అందుకుంది.
అయితే ఇది అన్ని భాషల్లో కలుపుకొని అందుకున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. దీని బట్టి ఈ సాంగ్ ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ భారీ చిత్రంలో ఆలియా భట్ సహా అజయ్ దేవగన్ లాంటి బాలీవుడ్ స్టార్ లు నటించగా డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల మేర బడ్జెట్ తో నిర్మాణం వహించారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా నెవర్ బిఫోర్ స్థాయిలో మార్చ్ 25న రిలీజ్ కాబోతుంది.