RRR : వైరల్ : “RRR”కి ఇద్దరు మాస్ హీరోలు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?

RRR : ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా మొత్తం పాన్ ఇండియన్ సినిమా దగ్గరే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కోసం అందరికీ తెలిసిందే. ఇండియా లోనే బిగ్గెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం లో ఇద్దరు మాస్ హీరోలు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు అల్లూరి సీతారామరాజుగా మరియు కొమరం భీం లుగా నటించారు.

అయితే ఈ భారీ సినిమాకి గాను వీరితో పాటు బాలీవుడ్ అయినటువంటి అజయ్ దేవగణ్ సహా అలియా భట్ లు కూడా నటించగా వీరు ఈ సినిమాకి ఏ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారో ఆ భారీ ఫిగర్స్ లెక్కలు బాలీవుడ్ వర్గాల్లో బయటకి వచ్చి వైరల్ అయ్యాయి. మరి వీరే ఇంత తీసుకుంటే అసలు ఈ సినిమాలో హీరోలుగా నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఎంత తీసుకున్నారో అనేది తెలుస్తుంది.

ఈ ఇద్దరు హీరోలు ఈ సినిమా కోసం భారీ స్థాయిలో చెరో 55 కోట్లు రెమ్యునరేషన్ ని తీసుకున్నారట. ఇప్పుడు ఈ టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతుంది. ఆల్రెడీ దర్శకుడు రాజమౌళి ఈ సినిమాలో ఇద్దరు హీరోలని సమానంగా చూపిస్తారని తెలిసిందే. ఇది ఈ రెమ్యునరేషన్ తోనే క్లియర్ అయ్యిందని చెప్పాలి. ఫైనల్ గా అయితే ఈ సినిమా రిలీజ్ కోసం మాత్రం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.