RRR Movie Makers : క్రేజీ..ఫ్యాన్స్ కి ఇంట్రెస్టింగ్ షాకిచ్చిన “RRR” టీం..ఎలాగంటే.!

RRR Movie Makers : ప్రస్తుతం పాన్ ఇండియన్ సినిమా దగ్గర భారీ చిత్రం ట్రిపుల్ ఆర్(RRR) కోసం అంతా ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భారీ అంచనాల నడుమ ఎప్పుడు వచ్చినా రికార్డులు తిరగరాసే సినిమాగా ఇది ఇండియన్ సినిమా దగ్గర కాచుకొని ఉంది.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో దర్శక ధీరుడు రాజమౌళి తీసిన ఈ భారీ పీరియాడిక్ వండర్ మళ్ళీ ఎట్టకేలకు ఒక కొత్త రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాపై అంచనాలను ఎంతగానో పెంచింది ఈ సినిమా ట్రైలర్ అని తెలిసిందే.

దీనిని అప్పుడు జనవరి 7 రిలీజ్ డేట్ తో రిలీజ్ చేసి అలా వదిలేసారు. కానీ ఇప్పుడు దీనితో తోనే ఇంట్రెస్టింగ్ గా అభిమానులకు ఒక షాక్ ఇచ్చారు “RRR” యూనిట్. అదెలా అంటే ఇప్పుడు ఈ ట్రైలర్ ని ఏ భాషలో చూసిన జనవరి 7 మార్క్ పోయి కొత్త రిలీజ్ డేట్ మార్చ్ 25 కనిపిస్తుంది.

దీనితో ఇదెప్పుడు ఇదెలా మార్చేసారా అని అభిమానులు అయితే ఇప్పుడు జుట్టు పీక్కుంటున్నారు. మొత్తానికి ఇలా చిత్ర యూనిట్ చేసిన ఇంట్రెస్టింగ్ పని చాలా ఆసక్తికరంగా మారిపోయింది.