ప్రపంచ వ్యాప్తంగా “RRR” కి మరోసారి సంచలన రెస్పాన్స్..!

RRR

టాలీవుడ్ మాస్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా ఒలీవియా మోరిస్ మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ లు హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాని దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించారు. అయితే భారీ బడ్జెట్ తో భారీ పాన్ ఇండియా సినిమా ట్రిపుల్ ఆర్(RRR).

అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యి 50 రోజుల్లో సుమారు 1200 కోట్ల దగ్గరకి వసూళ్లు అందుకున్న ఈ సినిమా ఎట్టకేలకు ఓటిటి లోకి కూడా వచ్చేసింది. అయితే తెలుగు మరియు ఇతర భాషల్లో జీ 5 లో రాగా హిందీలో నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది. అయితే రెండిటిలో కూడా ఈ సినిమా భారీ స్థాయి రెస్పాన్స్ తో అదరగొడుతుండగా..

జీ 5 లో అయితే ఈ సినిమా రికార్డులు బ్రేక్ చేస్తుందట. ఏకంగా 1000 మిలియన్ కి పైగా నిమిషాల స్త్రీమింగ్స్ తో సంచనలసంచలన రెస్పాన్స్ అందుకోవడమే కాకుండా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుంది.

దీనితో చిత్ర యూనిట్ మరియు జీ 5 స్ట్రీమింగ్ సంస్థ వారు ఒక ఇంట్రెస్టింగ్ ప్రోమో ని కట్ చేసి ఇలాంటి భారీ రెస్పాన్స్ ని అందుకున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందించగా డీవీవీ దానయ్య 500 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మాణం వహించారు.

https://www.instagram.com/tv/CeDN_M-gg_L/?utm_source=ig_web_copy_link