నెట్ ఫ్లిక్స్ లో దుమ్ము లేపిన “RRR”.. భారీ భారీ రికార్డులు నమోదు.!

రీసెంట్ ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో తీసిన ఈ సినిమా 1100 కోట్లకి పైగా వసూళ్లను అందుకొని భారీ రికార్డులు నెలకొల్పింది. మరి బాక్సాఫీస్ దగ్గర మైండ్ బ్లాకింగ్ రన్ ని చూపించిన ఈ సినిమా ఓటిటి దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో హిందీ భాషలో స్ట్రీమింగ్ వచ్చింది.

అయితే హిందిలో అయితే దుమ్ము లేపినట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. గత మే 23 నుంచి 29 మధ్యలో ఏకంగా ఈ సినిమా అనేక దేశాల్లో టాప్ ప్లేస్ లో నిలిచి 18,360,000 గంటల స్ట్రీమింగ్ తో నాన్ ఇంగ్లీష్ సినిమాగా భారీ రికార్డు నెలకొల్పి నెట్ ఫ్లిక్స్ లో నెంబర్ 1 సినిమాగా నిలిచింది.

దీనితో ఈ ప్రౌడ్ మూమెంట్ ని మేకర్స్ ఇప్పుడు అనౌన్స్ చెయ్యగా మరోసారి ఇండియన్ సినిమా దగ్గర ఈ సినిమా పేరు భారీ లెవెల్లో మారు మోగుతుంది. ఇంకా ఈ సినిమాలో బాలీవుడ్ నటి అలియా భట్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించగా ఒలీవియా మోరిస్ ఎన్టీఆర్ సరసన నటించింది. అలాగే ఎంతోమంది కీలక నటులు ఈ సినిమాలో మరిన్ని ఇంట్రెస్టింగ్ పాత్రల్లో నటించగా ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.