RRR Movie Collection : మరో రికార్డు మార్కు అందుకున్న “RRR” వసూళ్ళ ప్రభంజనం.!

RRR Movie Collection

RRR Movie Collection : పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలతో విడుదల కి వచ్చిన భారీ సినిమాలలో ఇండియా బాక్సాఫీస్ ని షేక్ చేసిన సెన్సేషనల్ మల్టీస్టారర్ చిత్రం “ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి. రిలీజ్ తోనే ఎన్నో ఆల్ టైం రికార్డులు నెలకొల్పిన ఈ సెన్సేషనల్ మల్టీస్టారర్ లో ఇద్దరు మాస్ హీరోలు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తీసిన ఈ ఇంటెన్స్ ఏక్షన్ డ్రామా రికార్డ్ వసూళ్లు అందుకొని మరో 1000 కోట్ల సినిమాగా చరిత్రకు ఎక్కింది. మరి ఇప్పుడు ఇక్కడ నుంచి మరో 100 కోట్లు వసూలు చేసి ఏకంగా 1100 కోట్ల మార్క్ ని ఛేదించి ఇంకో మైలు రాయిని దాటి ప్రపంచ వ్యాప్తంగా 1150 కోట్ల మార్క్ కి చేరుకుంటుంది.

లాంగ్ రన్ లో అయితే మరో 50 కోట్లు ఈ సినిమా అందుకోవచ్చనే టాక్ నడుస్తుండగా మేకర్స్ ఈ 1100 కోట్ల వసూళ్లను కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి అయితే ఈ సినిమా హవా ఇలా నడుస్తోంది. ఇంకా ఈ సినిమాలో ఆలియా భట్ మరియు ఒలివియా మోరిస్ లు హీరోయిన్స్ గా నటించారు. అలాగే ఎం ఎం కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకి డివివి దానయ్య దాదాపు 500 కోట్లతో నిర్మాణము వహించారు.