RRR: ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్ బియాండ్.. ట్రైలర్ మామూలుగా లేదుగా!

RRR: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసిన నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదల అయ్యి రికార్డుల మూత మోగించింది. ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు సినిమాలను ప్రపంచయ స్థాయిలో గర్వించేలా చేశారు రాజమౌళి. ఏకంగా హాలీవుడ్ ప్రముఖుల వరకు తెలుగు సినిమాలను తీసుకువెళ్లాడు.

ఇక ఇంతటి చరిత్ర సృష్టించిన ఈ సినిమా డాక్యుమెంట‌రీ తీస్తున్నారు రాజమౌళి. ఆర్ఆర్ఆర్ బిహైండ్ అండ్‌ బియాండ్ అనే టైటిల్‌ తో ఈ డాక్యుమెంట‌రీ రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఈ డాక్యుమెంటరీని ఈ నెల అనగా డిసెంబర్ లో విడుదల చేస్తున్నారు. ప్రముఖ ఓటిటి ప్లాట్ఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌ లో ఈ డాక్యుమెంట‌రీ స్ట్రీమింగ్ కాబోతుంది. దీనికి సంబందించిన ప్రకటన కూడా చేశారు. ఇక ఇందులో ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ కి ముందు మేకింగ్, ప్రీ ప్రొడక్షన్, రిలీజ్ తర్వాత సినిమా సాధించిన విజయాలు ఇలా ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో అన్నీ క్లియర్ గా ఉంటాయి.

RRR: Behind and Beyond - Documentary Trailer | SS Rajamouli | NTR | Ram Charan | In Cinemas Dec 20

అయితే నేడు దీని ట్రైలర్ రిలీజ్ చేసారు మూవీ మేకర్స్. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ట్రైలర్ లో డైరెక్టర్ రాజమౌళి మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం ఇద్దరు పులులతో కలిసి పనిచేశాను. రామ్ చరణ్, ఎన్టీఆర్ సైతం ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డారు. ఇందులో హీరోయిన్ గా నటించిన ఆలియా కూడా ఈ సినిమా గురించి తెలిపింది. ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు మామూలుగా లేదు వీరి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కింది అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతానికి ట్రైలర్ మాత్రమే విడుదల చేసిన మూవీ మేకర్స్ ఈ డాక్యుమెంటరీ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.