RRR Movie Again Postponed : కన్ఫర్మ్ అప్డేట్ : “RRR” రిలీజ్ మళ్ళీ వాయిదా.. ఇక ఆ డేట్ లోనే ఫైనల్!

RRR Movie Again Postponed : పాన్ ఇండియా వైడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న భారీ చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా అయినటువంటి ట్రిపుల్ ఆర్(RRR) కూడా ఒకటి. దర్శక దిగ్గజం రాజమౌళి ఇద్దరు మాస్ హీరోలు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో తీసిన ఈ సినిమా తారా స్థాయి అంచనాలు నెలకొల్పుకొని రిలీజ్ కి రెడీ అయ్యింది.
ఇక లాస్ట్ లో సినిమా రిలీజ్ మళ్ళీ వాయిదా పడడంతో అభిమానులు బాగా డిజప్పాయింట్ అయ్యారు. మరి ఇదిలా ఉండగా తర్వాత ఊహించని రీతిలో రెండు డేట్స్ ని ఈ చిత్రం ఫిక్స్ చేసుకుంది. వాటిలో ఒకటి మార్చ్ 18 కాగా ఇంకొక్కటి ఏప్రిల్ 28న చిత్ర బృందం ఫిక్స్ చేశారు. అయితే మరి వీటిలో మళ్ళీ ఈ భారీ చిత్రం వాయిదా పడినట్టు తెలుస్తుంది.
ఈ చిత్రం మార్చ్ 18న రిలీజ్ అయితే అవ్వట్లేదట. ఎందుకంటే ఈ డేట్ కి కన్నడలో సినిమా రిలీజ్ అయ్యే అవకాశం లేదట. అక్కడ అదే వారంలో ఇటీవల కన్నడకి చెందిన స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మరణించిన సంగతి తెలిసిందే. మరి తాను నటించిన సినిమాల్లో ఒకటైన “జేమ్స్” ని మార్చ్ 16న రిలీజ్ కి ఫిక్స్ చేసారు.
దీనితో అక్కడ డిస్ట్రిబ్యూటర్ లు ఏ ఇతర సినిమాని కూడా రిలీజ్ చెయ్యకూడదని ఫిక్స్ అయ్యారట. అంటే రాజమౌళి సినిమా ఆగిపోయినట్టే అని చెప్పాలి. లేకపోతే ఆ నెక్స్ట్ వారం లేదా ఏప్రిల్ నెలలో రిలీజ్ కన్ఫర్మ్ అని తెలుస్తుంది. అయితే మార్చ్ లో అయితే ఈ సినిమా రిలీజ్ ఖచ్చితంగా అయితే ఆగిపోయింది అనేది కన్ఫర్మ్.