RRR Movie : తన ఫిల్మ్ కెరీర్ ని ఆపేస్తున్న “RRR” లో కీలక నటుడు..కానీ!

RRR Movie : సినిమా పరిశ్రమలో ఎప్పుడు ఎవరి జీవితం ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. తమకి ఉన్న టాలెంట్ తో పాటు లక్ కూడా ఉంటే గాని ఏ సినిమా ఇండస్ట్రీ లో అయినా నిలదొక్కుకోలేరు. మరి అలా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో ఆఫర్స్ తో దూసుకెళ్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు రాహుల్ రామకృష్ణ. తెలుగు లో తాను అందరికీ బాగా నోటెడ్ అయ్యిన సినిమా “అర్జున్ రెడ్డి”.

ఆ చిత్రంలో హీరో తో ట్రావెల్ అవుతు ఆ సినిమాలో బెస్ట్ పెర్ఫామెన్స్ ని అందించి ఓవర్ నైట్ గుర్తింపు తెచుకున్నాడు. మరి ఇక్కడ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజశేఖర్, జాతి రత్నాలు, హుషారు, బ్రోచేవారెవరురా లాంటి మెయిన్ లీడ్స్ లో ఒకడిగా నటించాడు. ఇప్పుడు అయితే ఇండియా లోనే భారీ సినిమా ట్రిపుల్ ఆర్(RRR) లో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు.

అయితే మరి ఇపుడు ఏమైందో కానీ తన సినిమా కెరీర్ ని ఆపేస్తున్నానని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు నుంచే కాదు ఈ 2022 ఏడాది తర్వాత ఇంకా ఏ సినిమాలు కూడా చెయ్యనని, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అంటూ పోస్ట్ పెట్టాడు. దీనితో తన ఫాలోవర్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇంత టాలెంటడ్ నటుడు ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడా అని అంతా అనుకుంటున్నారు.

కానీ ఇక్కడ ఇంకో మాట వినిపిస్తుంది ఇది బహుశా తన సినిమా కానీ ఏదైనా వెబ్ సిరీస్ లో డైలాగ్ కావచ్చని దాన్ని ప్రమోషనల్ రీచ్ గా ఇలా చేసి ఉంటారని తెలుస్తుంది. మొత్తానికి అయితే లైఫ్ అయితే తనది ఇప్పుడు టాలీవుడ్ మంచి ఆఫర్స్ కూడా అతడికి ఉన్నాయి మరి అసలు నిజం ఏమిటి అనేది అతడికే తెలియాలి.

https://twitter.com/eyrahul/status/1489648833252704257?s=20&t=d0QIX1dzW6UrQYNIkOOBew