Veeramallu : “హరిహర వీరమల్లు” లో “RRR” లాంటి భారీ ఏక్షన్ సీక్వెన్స్ అట.!

Veeramallu : ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర ఓ రేంజ్ లో ఏక్షన్ సినిమాలు వస్తున్నాయి. బడ్జెట్ లు పెరిగే కొద్దీ సినిమాలో క్వాలిటీ తో పాటు ఏక్షన్ ఎలిమెంట్స్ కూడా సాలిడ్ గా కనిపిస్తున్నాయి. అలా లేటెస్ట్ గా అయితే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఆడియెన్స్ ని ఎంతగానో థ్రిల్ చేసిన భారీ ఏక్షన్ డ్రామా ట్రిపుల్ ఆర్(RRR).
దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సెన్సేషనల్ ఏక్షన్ డ్రామా లో ఇంట్రెస్టింగ్ ఏక్షన్ సీక్వెన్స్ లని ప్రముఖ హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ తెరకెక్కించాడు. మరి ఇప్పుడు ఇదే ఏక్షన్ కొరియోగ్రాఫర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న భారీ సినిమా “హరిహర వీరమల్లు” కి కూడా వర్క్ చేస్తున్నాడు.
లేటెస్ట్ గా అయితే మళ్లీ పవన్ షూటింగ్ స్టార్ట్ చెయ్యడమే అదిరే ఏక్షన్ బ్లాక్ తో స్టార్ట్ చెయ్యగా ఒక్కసారిగా ఆసక్తి నెలకొంది.
మరి ఇదిలా ఉండగా ఇప్పుడు ఇంకో క్రేజీ గాసిప్ సినిమాపై వినిపిస్తోంది. RRR లో మొదట మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్రో కి ఏకంగా వేలాది మందితో ఒక క్రేజీ ఏక్షన్ సన్నివేశం ఉంటుంది అలాగే ఇప్పుడు హరిహర వీరమల్లు లో ఓ భారీ ఏక్షన్ సీక్వెన్స్ లో 1000 మందితో ప్లాన్ చేశారట.
దీనితో సినీ వర్గాల్లో ఇప్పుడు ఇదే మంచి హాట్ టాపిక్ గా వినిపిస్తోంది.
ఒక్కసారిగా1000 మందితో అంటే RRR లో సన్నివేశమే గుర్తు వస్తుంది. మరి సినిమాలో ఈ క్రేజీ సీన్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ భారీ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
అలాగే ఈ సినిమాని దసరా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.