RRR ను ఆస్కార్ రేస్ నుండి పక్కకు నెట్టిన ఇండియన్ సినిమా

రాజమౌళి దర్శకత్వం లో వచ్చిన RRR  ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. అయితే కొన్నాళ్లుగా ఈ సినిమా ఆస్కార్ రేస్ లో ఉందంటూ ఎన్టీఆర్, రామ్ చరణ్ లో ఎవరికీ ఆస్కార్ అవార్డు వస్తుంది అని సోషల్ మీడియా లో చర్చలు కూడా జరిగాయి. ఈ సినిమా ఆస్కార్ రేస్ లో ఉంటుందని బాగా హైప్ కూడా క్రియేట్  చేసారు.

కానీ RRR సినిమా ని ఆస్కార్ రేస్ నుండి తప్పించారు. అసలు మన వాళ్లే ఈ సినిమాను ఆస్కార్ నామినేషన్లకు పంపించలేదు. ఇక్కడి వడపోతలోనే ఆర్ఆర్ఆర్ సినిమాను పక్కన పెట్టేశారు. ఈ సినిమా బదులు గుర్జరతి సినిమా ‘ఛెల్లో షో’ ని ఆస్కార్ కి ఎంపిక చేసారు.

దీంతో ఆర్ఆర్ఆర్ అభిమానులు బాగా  హర్ట్ అయ్యారు. ‘ఛెల్లో షో’ సినిమా ని టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇటాలియన్లో వచ్చిన సినిమా ‘పారడిజో’ అనే చిత్రానికి రీమేక్‌గా ఉటుందని, స్లమ్ములో పెరిగే చిన్న పిల్లాడు.. సినిమాతో ప్రేమలో పడటంపై ఈ సినిమా ఉంటుందని, అలాంటి చిత్రాన్ని ఆస్కార్ రేసులోకి పంపిస్తారా? అంటూ సెలెక్షన్ కమిటీ మీద మండిపడుతున్నారు.