RRR Heroine : వైరల్ – తన బర్త్ డేకి హాట్ షోతో అదరగొట్టిన “RRR” హీరోయిన్.!

RRR Heroine :  ప్రస్తుతం పాన్ ఇండియా వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ సినిమాల్లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించిన చిత్రం “ట్రిపుల్ ఆర్(RRR)” కూడా ఒకటి. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని మేకర్స్ మరికొన్ని రోజుల్లో రిలీజ్ చెయ్యబోతుండగా..
ఈ గ్యాప్ లో చిత్ర యూనిట్ అంతా మళ్ళీ ప్రమోషన్స్ లో బిజీ అయ్యారు. అయితే ఈ మధ్యలోనే ఈ సినిమాలో చరణ్ సరసన హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ పుట్టినరోజు నిన్ననే వచ్చింది. దీనితో చిత్ర యూనిట్ సహా రామ్ చరణ్ కూడా తన విషెష్ ని తెలియజేసాడు.
అయితే ఇదిలా ఉండగా ఈ బర్త్ డే కి గాను ఆలియా పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో మంచి వైరల్ అవుతుంది. ఎక్కడో బీచ్ లో ఆరెంజ్ బికినీతో ఈ బర్త్ డే ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తూ తన హాట్ షో ని ఇంస్టాగ్రమ్ లో పోస్ట్ చేసింది.
దీనితో ఈ 29 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఈ యంగ్ బ్యూటీ హాట్ షో మంచి వైరల్ అవ్వసాగింది. రీసెంట్ గా ఈమె నటించిన గంగూబాయి ఖతియవాది తో సూపర్ హిట్ కొట్టి 100 కోట్లు వసూలు చేసింది. అలాగే మరికొన్ని రోజుల్లో మళ్ళీ తమ భారీ సినిమా “RRR” ప్రమోషన్స్ లో కనిపించనుంది.
https://www.instagram.com/reel/CbJ4-nTgLaQ/?utm_medium=copy_link