Roja: సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్… డిప్యూటీ సీఎం పై ఫైర్ అయిన రోజా!

Roja: తిరుపతిలో హై టెన్షన్ నెలకుంది.టీటీడీ గోశాల అంశంలో టీడీపీ, వైసీపీ పరస్పర సవాళ్లు కొనసాగుతున్నాయి. ఇవాళ కచ్చితంగా గోశాలకు వస్తానన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. ఇలా భూమన కరుణాకర్ రెడ్డి గోషాలకు వెళ్తాను అంటూ సవాల్ చేయడంతో ఆయన అక్కడికి వెళ్ళకుండా పోలీసులు తన ఇంటి చుట్టూ మోహరించి తనని అడ్డుకున్నారు.

ఇలా గోసాలకు వెళ్లకుండా భూమన కరుణాకర్ రెడ్డిని అడ్డుకున్న నేపథ్యంలో ఆయన రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు.ఇలా పోలీసుల ద్వారా అడ్డుకోవడం అయితే చేతకాని సవాళ్లు చేయడం ఎందుకు ? అంటూ ఫైర్ అయ్యారు. టీడీపీ నేతల ఛాలెంజీపైనే నేను స్పందించానాని… నన్ను రమ్మని వాళ్లే నిర్బంధించడం ఎంత వరకు న్యాయం? అంటూ ఆగ్రహించారు. టీడీపీ నేతలు గోశాల వద్ద ఉన్నప్పుడే నన్ను అనుమతించాలని కోరారు. నేను ఒక్కడినే రావడానికి సిద్ధం.. TDP నేతలు వెళ్లిపోయాక అనుమతిస్తే ఏం ఉపయోగం అంటూ భూమన ప్రశ్నించారు. ఇక ఈ ఘటన పై మాజీ మంత్రి ఆర్కే రోజా కూడా స్పందించారు.

ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. టిడిపి నేతలు చేసిన సవాల్ కి భూమన సిద్ధమయ్యారు. అయితే ఆయనని గోషాల వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు ఇలా తనని గోసాల వద్దకు అనుమతించే ధైర్యం టిడిపికి ఉందా అంటూ ఆమె ప్రశ్నించారు. ఇలా సవాల్ చేసి అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్? తిరుపతిలో గత కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున అపచారాలు జరుగుతున్నాయని రోజా కూటమి ప్రభుత్వంపై అయ్యారు.

తిరుమలలో చాలా అపచారాలు జరుగుతున్నాయి.. సనాతన ధర్మం అంటే ఇదేనా పవన్ కల్యాణ్? అని ఆగ్రహించారు మాజీ మంత్రి రోజా. ఇలా ప్రస్తుతం తిరుపతిలో హై టెన్షన్ నెలకొందనే చెప్పాలి గత కొన్ని నెలలుగా తిరుమల గోశాలలో వరుసగా ఆవులు చనిపోతున్నాయి ఈ విషయం గురించి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేవలం అసత్యపు వార్తలను ప్రచారం చేస్తున్నారు అంటూ తెలుగుదేశం నాయకులు దీనిని కొట్టిపారేశారు తప్ప ఎలాంటి విచారణకు కూడా ఆదేశించకపోవడంతో ఈ ఘటనపై పెద్ద ఎత్తున వివాదం నెలకొంది.