తాజాగా మంత్రి రోజా పవన్ పై మరోసారి విమర్శలు చేశారు. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర చేపట్టనున్న సంగతి తెలిసిందే. దీంతో పవన్ రాష్ట్రంలో బస్సు యాత్ర ఎందుకు చేయనున్నారనేది ప్రజలకు తెలియాలి అని రోజా గట్టిగా ప్రశ్నించారు.
చంద్రబాబుకు ఆపద రాకుండా పవన్ కాపాడటం ఏంటో అని వెటకారం చేశారు. ఇక ఆయన బస్సు యాత్ర చేస్తున్నది ప్రజల కోసమా.. చంద్రబాబు కోసమా అని ప్రశ్నించారు. ఇక అచ్చెనాయుడు కి తెలుగుదేశం పార్టీ మీద కోపం ఉన్నందుకే తరచూ పార్టీని మూసేస్తారు అంటున్నారు అని రోజా అన్నారు.