బిగ్ బాస్ షో లో రెచ్చిపోయిన రోహిత్ మెరీనా దంపతులు దుప్పట్లో దూరి మరీ?

దేశవ్యాప్తంగా నెంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దేశవ్యాప్తంగా అన్ని భాషలలో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో తెలుగులో కూడా ప్రసారమవుతోంది. ఇటీవల బిగ్ బాస్ సీజన్ సిక్స్ కూడా ప్రారంభమైంది. ఈ సీజన్ సిక్స్ లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొనగా 7 మంది కంటెస్టెంట్లు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సీజన్ సిక్స్ ఎనిమిదవ వారంలో కొనసాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు ఉండగా వీరిలో మెరీనా రోహిత్ కపుల్స్ కూడా ఉన్నారు.

భార్యాభర్తలైన వీరిద్దరూ బిగ్ బాస్ షో లో పాల్గొన్నారు. సాధారణంగా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ల మధ్య ముద్దులు హగ్గలో ఉండటం సహజం. అయితే వీరిద్దరూ అఫీషియల్ గా భార్యాభర్తలు కావడంతో బిగ్ బాస్ హౌస్ లో వీరిద్దరి రొమాన్స్ పీక్స్ కి చేరుకుంటుంది. తాజాగా జరిగిన ఎపిసోడ్ లో మెరీనా రోహిత్ బిహేవియర్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఎంత మొగుడు పెళ్ళాలు అయితే మాత్రం ఇలా హద్దులు దాటి ప్రవర్తించాలా ?అంటూ ఏకిపారేస్తున్నారు.

బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ లో మెరీనా అందరిముందూ రోహిత్ కి ముద్దు పెట్టింది. ఆ తర్వాత మళ్లీ దుప్పట్లో దూరి మరీ లిప్ లాక్ ఇచ్చింది. అయితే వీరి వ్యవహారం రోజురోజుకీ హద్దులు దాటడంతో ఇంటి సభ్యులందరూ షాక్ అవుతున్నారు. అయితే ప్రతిరోజు ఈ షో ని లక్షల సంఖ్యలో ప్రేక్షకులు చూస్తున్నారు. ఇలా ఇంతమంది చూస్తున్న ఈ షోలో ఇలా రెచ్చిపోయి ప్రవర్తించటంతో ప్రేక్షకులు ఈ జంటపై మండిపడుతున్నారు. అలాగే ఇలాంటివి ఎంకరేజ్ చేస్తున్న బిగ్ బాస్ షో నిర్వాహకుల పట్ల కూడా ఆడియన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ షో రద్దు చేయాలి అంటూ కోర్టులో కేసు కూడా నడుస్తున్న తరుణంలో ఇలాంటి వ్యవహారాలు బయటపడటంతో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.