రీతూ వర్మా.. ఇలాగైతే ఎలాగమ్మా.?

‘టక్ జగదీష్’ సినిమాలో రీతూ వర్మ పాత్ర పరిశీలిస్తే, గ్లామర్‌కి దూరంగా, చాలా డిగ్నిఫైడ్‌గా కనిపించే పాత్ర అది. ఓ గవర్నమెంట్ ఉద్యోగిని (వీఆర్ఓ). డీసెంట్‌గా చుడీదార్స్, శారీస్‌లోనే కనిపించింది. ఆమె పాత్ర వరకూ అది ఓకే కానీ, గ్లామర్‌కి పూర్తిగా దూరంగా ఉన్న పాత్రది. ఇక తాజాగా ‘వరుడు కావలెను’ సినిమా తీసుకుంటే, ఇక్కడ కూడా మొదట్నుంచీ ఆమెకు ‘డిగ్నిటీ’ అనే పట్టం బాగా కట్టేస్తున్నారు.

స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలంటే, కేవలం డిగ్నిటీ పాత్రలుంటే సరిపోదు. కాస్త గ్లామర్ కూడా ఉండాల్సిందే. కానీ, రీతూవర్మకు బ్యాక్ టు బ్యాక్ డీసెంట్ పాత్రలకే ఫిక్స్ అయిపోయింది. అవకాశాలయితే వస్తున్నాయి కానీ, అవన్నీ ఒకే కోవకు చెందిన ఆఫర్లు కావడంతో ఆ విషయంలో రీతూ కూడా కాస్త డిజిప్పాయింట్ అవుతోందట. ఆమె అభిమానుల్లో తలెత్తుతున్న అభిప్రాయం కూడా ఇదే.

అయితే, తానేం మరీ అంత డీసెంట్ కాదు.. ఎలాంటి పాత్రలైనా డీల్ చేయగలను.. అంటూ తన సన్నిహితుల ద్వారా సంకేతాలు పంపిస్తోందట రీతూ వర్మ. అలా అని, ఏదో ఒక సినిమా చేసేయననీ, కథల ఎంపికలో తనకంటూ ఓ టేస్ట్ ఉందనీ చెబుతోంది అందాల రీతూ వర్మ.