RGV Failed With His Publicity Stunts : వర్మని నమ్మితే నట్టేట్లో మునిగిపోయినట్లే.!

RGV Failed With His Publicity Stunts :  ఒకప్పుడు టాప్ డైరెక్టర్. మంచి విషయమున్న డైరెక్టర్. ఆయన సినిమా అంటే అదో రకం కిక్కు. కానీ ఇప్పుడు ఆయన సినిమాల్లో అడల్ట్ కంటెంట్ తప్ప.. అందులోనూ హీరోయిన్ల గ్లామర్ షో తప్ప ఇంకేమీ వుండదని జనం ఫిక్స్ అయిపోయారు. ఎవరో ఆ డైరెక్టర్ అర్ధమైపోయే వుంటుంది.

సంచలనాల పిచ్చి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. విషయంతో పనిలేదు. కేవలం పబ్లిసిటీనే ఈయనకు కావాల్సింది. లేటెస్టుగా ఈయన కంపెనీ నుంచి ఓ సినిమా వచ్చింది. అదే ‘డేంజరస్’. సినిమా గురించి పెద్దగా మాట్లాడుకోవడానికేముంటుంది.? యాజ్ యూజువల్ అమ్మాయిలు, వాళ్ల అంగాంగ ప్రదర్శన. సినిమా మొత్తం దాంతోనే నింపేశాడు.

నిజానికి ఎప్పుడో పూర్తయిపోయిన సినిమా ఇది. కేవలం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై పడి ఏడవడం అన్న ఒక్క కారణంతోనే ఇంతవరకూ రిలీజ్ చేయలేదు. ‘ఆర్ఆర్ఆర్’లో ఇద్దరు హీరోలూ, నా సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అంతే తేడా.. అంటూ అదేదో దేశం గర్వించదగ్గ సినిమా అన్నట్లు ఈ ఆడంగిల్ని వేసుకుని దేశం మొత్తం తిరిగొచ్చేశాడు పబ్లిసిటీ పేరు చెప్పి.

ఇంతా చేస్తే ఈ సినిమా రిలీజ్ కాకుండా పోయింది. అత్యంత అభ్యంతరకరమైన కాన్సెప్టుతో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్‌‌పై కొందరు కోర్టులో కేసు వేయడంతో, సినిమా రిలీజ్ ఆపేసుకోవల్సి వచ్చింది. అయినా వర్మ సినిమాలో ఏమీ వుండదని జనం ఎప్పుడో ఫిక్సయిపోయారనుకోండి. ఎవరో ఆయనలాంటి పిచ్చోళ్లు ఇంకా నమ్ముతున్నారంతే.

ఏది ఏమైతేనేం, ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్న ఆడంగిలు.. అదేనండీ హీరోయిన్లు అప్సరా రాణి, నైనా గంగూలీ పరిస్థితే నట్టేట్లో మునిగినట్టయ్యింది పాపం.!