Home News రేవంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానముందా కేసీఆర్..? చెడుగుడు ఆడేసుకున్న ఫైర్ బ్రాండ్

రేవంత్ రెడ్డి ప్రశ్నలకు సమాధానముందా కేసీఆర్..? చెడుగుడు ఆడేసుకున్న ఫైర్ బ్రాండ్

 తెలంగాణ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సెగ మరింత రాజుకుంది. విమర్శలు, ప్రతి విమర్శలతో నగరం వేడెక్కిపోతుంది. కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తాజాగా ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్‌ ద ప్రెస్‌’ కార్యక్రమంలో ఒక పక్క తెరాస పై, మరోపక్క బీజేపీ మజ్లీస్ మీద నిప్పులు చెరుగుతూ విమర్శనాస్త్రాలు సంధించాడు.

Revanth Reddy

 సినిమాల్లో రౌడీలు అమాయకులను చంపాలనుకున్నప్పుడు దొమ్మీని సృష్టించినట్లుగా.. రాష్ట్రంలో కాంగ్రె్‌సను చంపేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీ కలిసి దొమ్మీని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని, ఢిల్లీలో మోదీకి, తెలంగాణలో కేసీఆర్‌కు కాంగ్రెస్‌ పార్టీయే ప్రత్యామ్నాయమని, దీంతో శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్లుగా.. ఈ రెండు పార్టీలు కలిసిపోయి కాంగ్రెస్ ను చంపేయాలనే కుట్రతోనే రాజకీయాలు చేస్తున్నాయని వాస్తవానికి బీజేపీ, టీర్‌ఎస్‌, ఎంఐఎం పార్టీలూ మూడూ ఒకటేనన్నారు.

 ఎదురుపడితే కుతికలు తెగుతాయన్నట్లుగా బీజేపీ, ఎంఐఎం నేతల ఉపన్యాసాలుంటాయని, కానీ.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, అసదుద్దీన్‌ ఒవైసీ మాత్రం అలయ్‌ బలయ్‌ చేసుకుంటారని అన్నా రు. దుబ్బాక ఎన్నికలు వన్‌ టైం వండర్‌ లాంటివని, పాలపొంగు శాశ్వతం కాదని రేవంత్‌ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో కేసీఆర్ మీద అనేక అవినీతి ఆరోపణలు కూడా రేవంత్ రెడ్డి చేయటం జరిగింది.

 కరోనా సమయంలో సీఎం సహాయనిధికి వచ్చిన రూ.4 వేల కోట్ల విరాళాలకు లెక్కలు లేవని, ఆ సమయంలో ప్రజలు కష్టాలు పడుతుంటే.. దానిని ఆసరా చేసుకుని రూ.1500 కోట్ల స్కాంకు తెరతీశారని, పేకాట క్లబ్బులు లేవని మంత్రి కేటీఆర్‌ అంటున్నారని, కానీ.. ఒక మంత్రి అల్లుడు, ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ఆన్‌లైన్‌ రమ్మీ నడుస్తోందని, మరో మంత్రి వియ్యంకుడి ఆధ్వర్యంలో గుట్కా వ్యాపారం నడుస్తోందని రాష్ట్రంలో మాఫియాలన్ని తెరాస నేతల చేతుల్లోనే ఉన్నాయని రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశాడు, మరి రేవంత్ రెడ్డి చేసిన విమర్శలపై తెరాస నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

- Advertisement -

Related Posts

షాకింగ్ : జైలుకి వెళ్లబోతోన్న టాలీవుడ్ యంగ్ హీరో ??

టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే కెరీర్ లో సెటిలవబోతున్న ఒక యంగ్ హీరో జైలుకి వెళ్ళే అవకాశాలున్నాయని ఫిల్మ్ నగర్ లో అలాగే సోషల్ మీడియాలోనూ న్యుస్ వైరల్ గా మారింది. సినిమాలలో నటించాలని...

ఆర్ఆర్ఆర్ కి రాజమౌళి ఒకే ఒక్క ఫోటో తో ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చాడు..!

ఆర్ఆర్ఆర్ టాలీవుడ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ సినిమా. లాక్ డౌన్ తర్వాత శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా తాజా అప్ డేట్ ను ఇచ్చారు రాజమౌళి బృందం. సంక్రాంతి...

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్.. ఆ అవసరం ఎవరికి.?

వున్నపళంగా తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రాజీనామా చేసెయ్యాలేమో.. ఆ స్థానంలో కేటీఆర్ కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోక తప్పదేమో. ఇదీ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న తాజా చర్చ. పలువురు మంత్రులు,...

ఇలా ముద్దులు పెట్టేస్తోందేంటి?.. రెచ్చగొడుతోన్న పాయల్

పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎంత బోల్డ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆర్ఎక్స్ 100 సినిమాతో పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియాలో ఎనలేని క్రేజ్‌ను తెచ్చుకుంది. ఆ ఒక్క సినిమాతో టాలీవుడ్ క్రేజీ...

Latest News