రేణు దేశాయ్ మళ్ళీ కన్ఫ్యూస్ చేస్తుంది

‘బద్రి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రేణు దేశాయ్, ఆ తర్వాత ‘జానీ’ సినిమాలో మరో సారి పవన్ కళ్యాణ్ తో నటించి, నటనకు పూర్తిగా స్వస్తి చెప్పింది. పవన్ కళ్యాణ్ తో ప్రేమలో పడ్డ రేణు దేశాయ్ కొన్నాళ్ల డేటింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ తో వివాహ బంధం లోకి అడుగుపెట్టింది. అయితే ఇద్దరు పిల్లలు పుట్టాక, కొన్ని మనస్పర్ధలవల్ల పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ విడిపోయారు. అయితే పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకోగా…రేణు దేశాయ్ మాత్రం ఒంటరిగా….పిల్లల్ని చూసుకుంటూ ఉంది.

కొన్నాళ్ల క్రితం తాను రెండో పెళ్ళికి సిద్ధం అని ఒక హింట్ ఇచ్చింది రేణు దేశాయ్. అయితే పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాత్రం దీనిని వ్యతిరేకించారు. అప్పట్లో రేణు ఒకవేళ ఎవర్నైనా పెళ్లి చేసుకుంటే అతని అంతు చూస్తామని  వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఆ వార్త పైన ఎలాంటి క్లారిటీ రాలేదు.

ఇప్పుడు మ‌రోసారి రేణూ దేశాయ్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. జీవితంలో అవ‌స‌రం ఉన్న‌ప్పుడు చేయి ప‌ట్టుకుని న‌డిపించే ఒకతోడు కావాలి అంటూ రేణూ దేశాయ్ పోస్ట్ ను షేర్ చేసింది. దాంతో రేణూ రెండో వివాహం మ‌రోసారి హాట్ టాపిక్ గా మారింది.