వైరల్ గా మారిన రేణు దేశాయ్, పవన్ పిక్.. సంతోషంలో ఫ్యాన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ వివాహం చేసుకొని విడిపోయిన సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు ఉండగా ఆ ఇద్దరు పిల్లలు రేణుదేశాయ్ దగ్గరే పెరుగుతున్నారు. ఇక తాజాగా వీరి కొడుకు అకీరా నందన్ గ్రాడ్యుయేషన్ డే సందర్భంగా వీరిద్దరూ ఒకే చోట కలిసారు.

హైదరాబాదులోని ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో గ్రాడ్యుయేషన్ డే జరగటంతో ఆ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ తన కొడుకు కోసం వచ్చాడు. అంతేకాకుండా తన మాజీ భార్య తో కలిసి ఫోటోలు కూడా దిగాడు. వీరిద్దరూ దూరంగా ఉన్నా కూడా తమ పిల్లల కోసం అప్పుడప్పుడు పట్టింపు లను పక్కకు పెడుతూ ఉంటారు. అలా తాజాగా వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారగా పవన్ అభిమానులు ఫుల్ సంతోషంగా ఫీల్ అవుతున్నారు.