Renu Desai : రేణు దేశాయ్ రెండో పెళ్ళి అయిపోయిందా.? ఆగిపోయిందా.?

Renu Desai :  ‘తప్పకుండా నేను రెండో పెళ్ళి చేసుకుంటాను.. నేనెందుకు చేసుకోకూడదు.?’ అంటూ ఓ ఇంటర్వ్యూలో చాలా ఘాటుగా తనకెదురైన ప్రశ్నకు సమాధానమిచ్చారు సినీ నటి రేణు దేశాయ్. ‘బద్రి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రేణు దేశాయ్, ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో ప్రేమలో పడటం, పవన్ కళ్యాణ్‌తో కొన్నాళ్ళు సహజీవనం చేసి, 2009లో పెళ్ళి చేసుకోవడం తెలిసిన విషయాలే కదా.

పవన్ – రేణుదేశాయ్ వైవాహిక జీవితానికి రెండు గురుతులుగా అకిరానందన్, ఆద్య జన్మించారు. అయితే, ఆ తర్వాత ఇద్దరి మధ్యా అభిప్రాయ బేధాలు తలెత్తి విడాకులు తీసుకున్నారు కూడా. విడాకుల తర్వాత రేణు దేశాయ్, పవన్ కళ్యాణ్ మధ్య సఖ్యత అలాగే వుందా.? లేదా.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.

సినిమాల్లో రీ-ఎంట్రీ ఇచ్చేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారుగానీ, సరైన ఛాన్సులైతే ఆమెకు రావడంలేదు. ఇదిలా వుంటే, కొన్నాళ్ళ క్రితం తాను మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నట్లు రేణు దేశాయ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాంతో, పవన్ అభిమానుల పేరుతో కొందరు రేణు దేశాయ్‌ని ట్రోలింగ్ చేశారు. ఆ తర్వాత పెళ్ళి గురించి రేణు దేశాయ్ పెద్దగా ఎక్కడా మాట్లాడలేదు. పవన్ అభిమానుల పేరుతో గలాటా కూడా తగ్గింది.

అయితే, కొందరు రాజకీయ కోణంలో రేణు దేశాయ్‌ని సోషల్ మీడియా వేదికగా రెచ్చగొడుతున్నారనీ, పవన్ అభిమానులమని చెప్పుకుంటూ రేణు దేశాయ్ మీద విమర్శలు చేస్తూ, ఆమె ద్వారా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు వచ్చేలా చేస్తున్నారనీ అంటారు చాలామంది.

ఇంతకీ, రేణు దేశాయ్ రెండో పెళ్ళి జరిగిపోయిందా.? ఆగిపోయిందా.? ఇదైతే సస్పెన్సే. అయిపోయిందంటారు కొందరు, ఆగిపోయిందంటారు మరికొందరు. ఏది నిజమో తెలియాలంటే రేణు దేశాయ్ పెదవి విప్పాల్సిందే.