ఇన్సైడ్ టాక్ : పవర్ స్టార్ భారీ సినిమా రిలీజ్ కి సమయం ఫిక్స్ చేసారా.?

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు పలు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. వాటిలో మొదటగా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. పవన్ కెరీర్ లోనే ఒక భారీ సినిమాగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాని చిత్ర యూనిట్ చాలా వరకు కంప్లీట్ చేశారు.

అయితే నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ పై ఇది వరకు ఒక టాక్ ఉండేది. ఈ ఏడాదిలోనే దసరా కానుకగా రావచ్చని బజ్ వినిపించింది. కానీ ఇప్పుడు అయితే ఈ సినిమా ఈ ఏడాదిలో వచ్చే సూచనలు లేనట్టుగా తెలుస్తుంది. మరి తాజా సమాచారం ప్రకారం అయితే చిత్ర యూనిట్ ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారట.

అయితే జనవరి మొదటి వారంలో గాని లేదా సంక్రాంతి బరిలో పోటీకి దింపనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పలువురు స్టార్ బాలీవుడ్ నటీనటులు ఈ చిత్రంలో నటించడానికి సిద్ధంగా ఉండగా మేకర్స్ ఇప్పుడు మరో షెడ్యూల్ కి సిద్ధం అవుతున్నారు. అలాగే ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏ ఎం రత్నం భారీ వ్యయంతో నిర్మాణం అందిస్తున్నారు.